Kastruba Gandhi College Gas Leak : సికింద్రాబాద్ కస్తూర్బా కాలేజీలో కెమికల్ గ్యాస్ లీక్, పలువురు విద్యార్థినులకు అస్వస్థత
సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీ సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
- Naveen
- Updated on- November 18, 2022 / 07:36 PM IST
Kastruba Gandhi College Gas Leak : సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ కాలేజీ సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కస్తూర్బా కాలేజీలో విష వాయువుల లీక్ కావడం, 41మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గ్యాస్ ఎలా లీక్ అయింది? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా, గ్యాస్ లీక్ అయి విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
