chicken prices: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

సండే వచ్చింది.. చికెన్‌తో విందు ఆరగిద్దామని ఆలోచిస్తున్న జనానికి పెరిగిన చికెన్ ధరలు షాకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

chicken prices: సండే వచ్చింది.. చికెన్‌తో విందు ఆరగిద్దామని ఆలోచిస్తున్న జనానికి పెరిగిన చికెన్ ధరలు షాకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆదివారం రోజు ఏపీలో కేజీ చికెన్ ధర రూ.350 వరకు ఉంటే, తెలంగాణలో కేజీ చికెన్ ధర దాదాపు రూ.300 వరకు ఉంది. రిటైల్ షాపుల్లో బ్రాయిలర్ చికెన్ స్కిన్‌లెస్ ధర రూ.300 ఉంటే, ఆన్‌లైన్‌లో అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంది. దేశీ చికెన్ కేజీ ధర మాత్రం దాదాపు రూ.470గా ఉంది. ఇంతకుముందు కేజీ రూ.150-200 వరకు పలికిన ధరలు ఉన్నట్లుండి పెరిగేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు వ్యాపారులు.

 

ప్రస్తుత సీజన్‌లో చికెన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. పెళ్లిళ్లు, ఫెస్టివల్స్ ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువైంది. పెరిగిన పెట్రోల్, డీజిల ధరలు కూడా చికెన్ ధరలు పెరిగేందుకు కారణాలుగా చెబుతున్నారు. వీటితోపాటు కోళ్ళ దాణా ఖర్చులు పెరగడం, ఎండల ప్రభావంతో చాలా కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తి తగ్గింది. ఇలాంటి అనేక కారణాలతో చికెన్ ధరలు పెరిగాయి. గత మార్చి నుంచి నెమ్మదిగా చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, దాదాపు ఐదు నెలల క్రితం చికెన్ ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నిచోట్ల కేజీ చికెన్ రూ.80లకే అమ్మారు. ఆ సమయంలో విపరీత నష్టాలు రావడంతో కోళ్ల పెంపకం దారులు తమ వ్యాపారాల్ని మూసేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు