Carbon Dioxide : కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చేసిన చైనా శాస్త్రవేత్తలు.. ఉపయోగాలివే

చైనా శాస్త్రవేత్తలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చటంలో విజయం సాధించారు. కిరణజన్య సంయోగ క్రియద్వారా మొక్కలు పిండిపదార్ధాన్ని తయారుచేసే సమయం కంటే వేగంగా ఈ ప్రక్రియ చేశారు

Carbon Dioxide Corvert Carbohydrate

Carbon Dioxide Converted Into A Carbohydrate : కార్బన్‌డయాక్సైడ్ అంటే మనకు కాలుష్యమే గుర్తుకొస్తుంది. గాల్లో కలిసిపోయి మనిషి శ్వాస వ్యవస్థమీద దాడిచేస్తుంది. ఓ పక్క పెరుగుతున్న కాలుష్యం మరో పక్క చెట్ల నరికివేత. వెరసి కార్బన్ డయాక్సైడ్ ప్రమాదకంగా మారుతోంది. చెట్ల కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని మనకు ఆక్సిజన్ (ప్రాణవాయువు)ని ఇస్తాయి. ఆ ఆక్సిజన్ ను మనం పీల్చుకుని కార్బన్‌డయాక్సైడ్ ను బయటకు వదులుతాం. ఇది కంటికి కనిపించని ప్రక్రియ. ఇదిలా ఉంటే కంటికి కనిపించని గాలిలో కలిసిపోయిన కార్బన్‌డయాక్సైడ్ ను పిండిపదార్ధంగా మార్చేస్తే?!..

మొక్కలకు అది సాధ్యమే. మరి మనిషికి అది సాధ్యమవుతుందా? మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయి. దానికి కోసం మొక్కలకు నీరు అవసరం. కానీ ఇప్పుడు మొక్కలే కాదు అది మనిషికి కూడా సాధ్యమేనని నిరూపించారు చైనా శాస్త్రవేత్తలు. అంటే కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చి చూపించారు శాస్త్రవేత్తలు.

Read more : World Heart Day: గుండెను గడ్డ కట్టించి..తిరిగి కొట్టుకునేలా చేసిన శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ..!

పిండి పదార్థం తయారు కావాలంటే బోలెడంత నీరు, భూమి అవసరం. కానీ, ఇవేవీ లేకుండా.. కేవలం కాలుష్య కారక కార్బన్‌డయాక్సైడ్‌ అనే వాయువునే పిండిపదార్థంగా మార్చగలిగితే? అని ఆలోచించారు చైనా శాస్త్రవేత్తలు. అనుకున్నదే తడవుగా ఆ ప్రక్రియ మొదలు పెట్టటం దాన్ని సక్సెస్ కూడా చేసేశారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయని ముందే చెప్పుకున్నాం కదా..ఈ ప్రక్రియలో భాగంగా 60కి పైగా వరసాయనిక చర్యలు జరుగుతుంటాయి. కానీ అంతకంటే ఈజీగా పిండిపదార్థాన్ని తయారు చేయటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు.

దీనిపై కసరత్తులు చేసిన చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగప్రక్రియ కంటే ఎంతో వేగంగా కృత్రిమ పద్ధతుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చిచూపించారు. ఈ ప్రయోగాల్లో విజయం సాధించారు. ఇలా మొక్కలంటే వేగంగా కార్బన్ డయాక్సైడ్ ను పిండిపదార్ధంగా తయారు చేసే పరిశోధనలకు చీటావో అనే శాస్త్రవేత్త సారధ్యం వహించారు.

Read more : World Heart Day: గుండెను గడ్డ కట్టించి..తిరిగి కొట్టుకునేలా చేసిన శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ..!

సేంద్రియ ఉత్ప్రేరకం సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను మెథనాల్‌గా, ఆ తరువాత కృత్రిమ ఎంజైమ్‌ల సహయాంతో చక్కెరలుగా మార్చడం..వీటి నుంచి పిండిపదార్థం తయారు చేయడం ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం. మొక్కజొన్న కంటే 8.5 రెట్లు ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేయగలగడం కొత్త పద్ధతి ప్రత్యేకత. పిండిపదార్థాన్ని ఇలా కొత్తపద్ధతిలో తయారు చేసుకుంటే పర్యావరణానికి నష్టం చేస్తున్న కీటకనాశినులు, రసాయనిక ఎరువుల వాడకాన్ని భారీగా తగ్గించవచ్చని, పిండిపదార్థం కోసం ఉపయోగిస్తున్న పంటభూమిని కూడా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు ప్రముఖ శాస్త్రవేత్త చీటావో.