Chiranjeevi To Play God Father Role In Prabhas Salaar
Salaar: టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’..
డార్లింగ్ పక్కన శృతి హాసన్ తొలిసారి కథానాయికగా నటిస్తుండగా.. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి విలన్‌గా కనిపించనున్నారు..
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ అదిరిపోయే క్యారెక్టర్ చెయ్యబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ‘సలార్’ లో చిరు, ప్రభాస్‌కి గాడ్ ఫాదర్ లాంటి రోల్‌లో కనిపించబోతున్నారట.. ఇదే విషయం గురించి ఆరా తియ్యగా.. అవన్నీ పుకార్లేనంటూ మెగా కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది..