Santa Claus In Puri : పూరీ జగన్నాథుడి చెంత..గులాబీలతో 50 అడుగుల శాంతాక్లాజ్

ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడి చెంత క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ శాంతాక్లాజ్ ఆకట్టుకుంటున్నాడు. 50 అడుగుల భారీ శాంతాక్లాజ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆకట్టుకుంటున్నాడు.

50fts long Santa Claus In Puri : ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడి చెంత క్రిస్మస్ పండుగ సందర్భంగా భారీ శాంతాక్లాజ్ ఆకట్టుకుంటున్నాడు. లోకానికి రక్షణ ఇవ్వటానికి దేవుని కుమారుడు క్రీస్తుగా ఈ భూలోకంలో జన్మించాడని క్రైస్తవుల నమ్మకం. క్రీస్తు పుట్టిన రోజునే క్రిస్మస్ అని అంటారు. క్రైస్తవులకు అతపవిత్రమైన పెద్ద పండుగ ఈ క్రిస్మసే. క్రిస్మస్ రోజు పురస్కరించుకుని ఒడిశా తీరంలో రూపొందించిన శాంతాక్లాజ్ సైతక శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రముఖ సైతక శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో 50 అడుగుల పొడవు, 28 అడుగుల వెడల్పైన శిల్పానికి రూపొందించారు. దీనికోసం 5,400 ఎర్ర గులాబీలతో పాటు ఇతర పూలను ఉపయోగించాడు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ పండుగ జరుపుకోండన్న సందేశంతో ఉన్న శాంతాక్లాజ్ శిల్పాన్ని రూపొందించారు.

ట్రెండింగ్ వార్తలు