తేజస్వి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఆర్థిక సాయం

cm jagan gives 10 lakhs to tejaswini family: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన తేజస్వి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ భాస్కర్ పరామర్శించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. తేజస్వి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. బాధితులు కోరిన మేరకు వారి పెద్ద కూతురికి ఉద్యోగ విషయాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ భాస్కర్ హామీ ఇచ్చారు.

ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన పాపిశెట్టి తేజస్విని(19) కాలేజీ ఫీజులు చెల్లించలేక శుక్రవారం(ఫిబ్రవరి 5) అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. తేజస్విని ఒంగోలులో క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ సెకండియర్ చదువుతోంది.

తేజస్విని తండ్రి నాగేశ్వరరావు కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే సంపాదనతో కుటుంబం గడవడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు ఇటీవలే రూ.35వేలు తేజస్విని కాలేజీ ఫీజు చెల్లించాడు. అయితే మిగతా ఫీజు చెల్లించడం తన వల్ల కాదని చెప్పడంతో తేజస్విని మనస్తాపానికి గురైంది. చదువుకు దూరమవుతానన్న ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడింది.

ట్రెండింగ్ వార్తలు