cm jagan participates in rajashyamala yagam: విశాఖ పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ సీఎం జగన్ కి స్వాగతం పలికారు. శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పూజా కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
నేటి(ఫిబ్రవరి 17,2021) నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది.