CM JAGAN: ఆటో ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. పది లక్షల పరిహారం ప్రకటన

ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

CM JAGAN: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఆటో ప్రమాద ఘటనపై సీఎం వై.ఎస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు, గాయపడ్డవారికి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం

ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి, సీఎంఓ అధికారులు ఘటన వివరాలను తెలియజేశారు. మరోవైపు ప్రమాదం జరిగిన ప్రదేశానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటన వివరాల్ని కేతిరెడ్డి వివరించారు. ‘‘ఆటోలో మొత్తం 11 మంది ఉండగా, వారిలో ఐదుగురు మరణించారు. మిగతా ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి చేర్చి, చికిత్స అందిస్తున్నాం. విద్యుత్ వైర్లపై నుంచి ఉడుత వెళ్లడంతో కరెంట్ షాక్‌ తగిలి ఉడుత కాలిపోయింది. దీంతో వైరు కూడా కాలి, తెగి, ఆటో పై పడిపోయింది. ఆటోపై ఉన్న ఇనుప మంచంపై వైరు పడటంతో కరెంటు షాక్ తగిలి, ఆటోకు మంటలు అంటుకున్నాయి.

Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?

వెంటనే డ్రైవర్ తన పక్కన కూర్చున్న ఇద్దరిని బయటకు తోసేసి, తను కూడా దూకేశాడు. వెంటనే అప్రమత్తమైన మరో ముగ్గురు కూలీలు కూడా ఆటోలోంచి దూకేశారు. మిగిలిన వారు సజీవ దహనమయ్యారు. ఆటోలో ప్రయాణించిన వాళ్లంతా వ్యవసాయ కూలీలే’’ అని కేతిరెడ్డి వివరించారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్పీడీసీఎల్ సి.ఎం.డి హరనాధ రావు స్పందించారు. ఉడుత విద్యుత్ పోల్ ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఘటనపై సాంకేతిక కమిటీతో, విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపిస్తామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు