Coffee-Liver Disease: అధ్యయనం.. కాఫీ తాగేవారిలో కాలేయ వ్యాధి తక్కువే!

చాలా మందికి నిద్రలేవగానే ఓ మంచి కప్పుడు కాఫీ కడుపులో పడకపోతే రోజు మొదలు కాదు. మంచి ఫిల్టర్ కాఫీ పెదవులకు తగలేకపోతే చాలామందికి అసలు ఏదీ తోచదు. అయితే.. అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచే చేస్తుందట. కాఫీ తాగేవారిలో కాలేయ వ్యాధి తక్కువగా ఉంటుందట. ఒక కొత్త అధ్యయనం ప్రకారం రెగ్యులర్ గా కాఫీ తాగటం వలన కాలేయ క్యాన్సర్ మరియు సిర్రోసిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

Coffee-Liver Disease: చాలా మందికి నిద్రలేవగానే ఓ మంచి కప్పుడు కాఫీ కడుపులో పడకపోతే రోజు మొదలు కాదు. మంచి ఫిల్టర్ కాఫీ పెదవులకు తగలేకపోతే చాలామందికి అసలు ఏదీ తోచదు. అయితే.. అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచే చేస్తుందట. కాఫీ తాగేవారిలో కాలేయ వ్యాధి తక్కువగా ఉంటుందట. ఒక కొత్త అధ్యయనం ప్రకారం రెగ్యులర్ గా కాఫీ తాగటం వలన కాలేయ క్యాన్సర్ మరియు సిర్రోసిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధిని నివారించడంలో ఒక కప్పు కాఫీ తోడ్పాటు కలిగించి సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని పరిశోధనలు కనుగొన్నాయి.

Coffee Liver Disease

స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్ సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుల బృందం నిర్వహించిన BMC పబ్లిక్ హెల్త్ లో ఆన్‌లైన్‌లో ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ అధ్యనయం ప్రకారం కాఫీ రోజు తాగడం వల్ల దీర్ఘ కాలిక కాలేయ వ్యాధులు రాకుండా అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన కాలేయం కోసం.. ప్రతిరోజు డైట్‌లో కాఫీ చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Coffee Liver Disease

మద్యం వలన కాలేయ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయినా చాలామంది మద్యానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడరు. అలాంటి వారు ఈ అధ్యయనం ప్రకారం రోజూ కాఫీ తీసుకుంటే కాలేయ నష్టాన్ని తగ్గించవచ్చని తేలింది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక వ్యాధి భారం, పరిమిత చికిత్స లభ్యత కలిగిన మధ్య ఆదాయ దేశాలలో ప్రజలకు ఇది చాలా ఉపకరిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. గత పరిశోధనలు కాలేయవ్యాధి నివారణలో కాఫీ వినియోగాన్ని ప్రస్తావించగా.. కొత్త UK అధ్యయనం ఆ ఫలితాలను ధృవీకరించడమే కాక వివిధ రకాలైన కాఫీ (డీకాఫిన్ చేయబడిన, గ్రౌండ్ కాఫీ)లు కాలేయ వ్యాధుల మరణాలను తగ్గించడానికి సహాయపడతాయని కనుగొన్నారు.

Coffee Liver Disease4

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు యూకే బయోబ్యాంక్ లో 2006 నుండి 4,94,585 మంది జన్యు, ఆరోగ్య సమాచారంతో బయోమెడికల్ డేటా బేస్ తీసుకొని విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు 40 నుండి 69 సంవత్సరాల వయస్సు వారు కాగా 2010లో వారు ఈ సర్వేలో చేరే సమయానికి పొగాకు, మద్యపానం, అలాగే వారు ఏ రకమైన కాఫీని తీసుకుంటున్నారో సర్వే చేశారు. అధ్యయనం ప్రారంభమైనప్పటి నుండి, బృందం దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో 3,600 కేసులను కనుగొనగా అందులో 301 మంది మరణించారు.

Coffee Liver Disease3

వీరిలో ఆల్కహాల్ వినియోగం, ధూమపాన అలవాట్లు, బాడీ మాస్ ఇండెక్స్ వంటి ఇతర వేరియబుల్స్ కలిపి లెక్కించిన తరువాత పరిశోధకులు అన్ని రకాల కాఫీలు కాలేయ వ్యాధుల నుంఢి రక్షణ కలిగిస్తుందని తేల్చగలిగారు. కాఫీ తాగేవారికి సిఎల్‌డి వచ్చే ప్రమాదం 21 శాతం కాగా క్రమం తప్పకుండా కాఫీ తాగని వారి కంటే 49 శాతం తక్కువ ప్రమాదం ఉందని తేల్చారు. రోజుకు మూడు నుండి నాలుగు కప్పులు తాగే వారిలో చాలా ముఖ్యమైన ఫలితాలు రాగా అంతకు మించి కాఫీ వినియోగంలో మరింత పెరుగుదల అదనపు ప్రయోజనాన్ని ఇవ్వలేదని వారు రాశారు.

ట్రెండింగ్ వార్తలు