Tamil Nadu DIG : తమిళనాడు డీఐజీ సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య
తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ శుక్రవారం ఉదయం రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేసిన విజయకుమార్ తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.
- saleem sk
- Published On : July 7, 2023 / 09:55 AM IST
Tamil Nadu DIG
Tamil Nadu DIG : తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ శుక్రవారం ఉదయం రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేసిన విజయకుమార్ తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. (Coimbatore top cop shoots self) రేస్ కోర్స్ సమీపంలో ఉంటున్న డీఐజీ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.
2009 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విజయకుమార్ కాంచీపురం కడలూర్, నాగపట్నం, తిరువారూర్ ఎస్పీ, డీఐజీగా పనిచేశారు. కోయంబత్తూర్ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో విజయకుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. డీఐజీ విజయకుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.
