త్వరలో Col సంతోష్ బాబు ఇంటికి సీఎం కేసీఆర్

  • Publish Date - June 20, 2020 / 12:10 AM IST

చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు ఫ్యామిలీకి రూ. 5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్ – 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ మేరకు 2020, జూన్ 19వ తేదీ శుక్రవారం ప్రకటించారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా..వీరమరణం పొందిన ఇతర భారతీయు సైనికులు (19 మంది) కుటుంబసభ్యులకు కూడా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి ద్వారా ఈ సాయాన్ని అందిస్తామన్నారు సీఎం కేసీఆర్.

2020, june 19వ తేదీ శుక్రవారం ప్రధాన మంత్రి నిర్వహించని అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. చైనా దురాగతాలపై ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…

సైనికులకు, వారి కుటుంబాలకు దేశం అండగా నిలువాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సైనికుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు, వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు యావత్తు దేశం వారి వెన్నంటే ఉండాలన్నారు. వీరమరణం పొందిన సైనిక కుటుంబాలను కేంద్రంతోపాటు రాష్ర్టాలు కూడా ఆదుకోవాలని, అప్పుడే దేశం తమవెంట నిలుస్తున్నదన్న నమ్మకం వారిలో ఇంకా పెరుగుతుందని తెలిపారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులన్నా మిగతా ఖర్చులు తగ్గించుకొనైనా సైనికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. 

Read: చైనా వస్తువుల నిషేధం తొందరపాటు చర్య : సీఎం కేసీఆర్