Tokyo Paralympics : పగలు కలెక్టర్.. రాత్రి బ్యాడ్మింటన్‌ ప్లేయర్…పారాలంపిక్స్ లో పతకసాధనే లక్ష్యం

కర్నాటక రాష్ట్రానికి చెందిన 38సంవత్సరాల సుహాస్ యతిరాజ్ 2007 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. యూపీలో అనేక జిల్లాల్లో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.

Tokyo Paralympics : ఉత్తర ప్రదేశ్ లో ఆ ఐఏఎస్ అధికారి పేరు తెలియని వారుండరు. కర్తవ్యం పట్ల నిబద్ధతే కాదు..క్రీడా రంగంలోనూ నైపుణ్యత అతని సొంతం. ఆగస్టు 24 నుండి టోక్యోలో ప్రారంభం కానున్న పారాలింపిక్స్ క్రీడల్లో భారత దేశానికి పతకాన్ని సాధించి పెట్టేందుకు ఆయన సన్నద్ధమౌతున్నాడు. ఇంతకీ ఆయనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే యూపీలోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్..చిన్ననాటి నుండి క్రీడలపై ఎంతో మక్కువ. అదే ఆయనన్ను అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారునిగా తీర్చిదిద్దింది.

కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో విశేషసేవలందించిన సుహాస్ స్ధానిక ప్రజల మన్ననలను అందుకున్నారు. పగలు కలెక్టర్ గా విధి నిర్వాహణ బాధ్యతలు నిర్వహిస్తూనే రాత్రి సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా తన లక్ష్య సాధనకోసం నిరంతర కృషి చేస్తున్నారు. టోక్యోలో జరగనున్న ప్రపంచస్ధాయి పారాలంపిక్స్ లో పతకాన్ని సాధించటాన్ని సుహాస్ సవాల్ గా స్వీకరించాడు. ప్రపంచస్ధాయి బ్యాడ్మింటన్ ఆటగాడిగా సుహాస్ మూడవస్ధానంలో ఉన్నాడు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన 38సంవత్సరాల సుహాస్ యతిరాజ్ 2007 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. యూపీలో అనేక జిల్లాల్లో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. తాను పనిచేసిన ప్రతిచోట విద్యాలయాల్లో క్రీడల పట్ల విద్యార్ధులను ప్రోత్సహించేవారు. ఇప్పటికే బ్యాండ్మింటన్ లో అనేక పతకాలను సుహాస్ సాధించాడు. ఇండోనేషియా జకార్తాలో 2018లో జరిగిన ఆసియా పారా గేమ్స్ లో క్యాంస్యం సాధించగా, 2017లో టర్కీలో జరిగిన బిడబ్ల్యుఎఫ్ టర్కీష్ ఓపెన్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్ మరియు డబుల్స్ లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 2016 ఆసియా ఛాంపియన్ షిప్ లో పురుషుల సింగిల్స్ లో బంగారు పతకాన్ని సాధించాడు.

టోక్యో పారాలంపిక్స్ ఈవెంట్ ఒకసవాలుగా మారుతుందనటంలో ఎలాంటి సందేహంలేదని అయినప్పటికీ దానిని సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు సుహాస్ మీడియాకు తెలిపాడు. గెలుపు ఓటములకు తేడా చాలా స్వల్పంగానే ఉంటుందని చెప్పాడు. తన లక్ష్యం అంత తేలికగా సాధించేది కాకపోయినప్పటికీ పట్టుదలతో ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశాడు సుహాస్

 

ట్రెండింగ్ వార్తలు