Asked them to target terrorism, they targeted me says PM Modi takes dig at Congress
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ధ్వజమెత్తారు. గుజరాత్ లో ఈ నెల 5న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇవాళ చోటా ఉదయ్ పూర్ జిల్లాలోని బొడెలీలో నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు.
‘గరీబీ హఠావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఇస్తోంది. ఆ హామీని నెరవేర్చడానికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇచ్చారు. కానీ, పేదరికాన్ని నిర్మూలించాలని ప్రజలనే కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. నినాదాలు, హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అంతేగానీ, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. అభివృద్ధి పనులు చేయడం లేదు. అందుకే కాంగ్రెస్ పాలనలో పేదరికం పెరిగిపోయింది’’ అని మోదీ విమర్శించారు.
FIFA World Cup-2022: సొంత దేశం ఓడిపోయినందుకు ఇరాన్‌లో ప్రజల సంబరాలు
గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తీసుకొచ్చిన పాలసీల వల్ల పేద ప్రజలు దేశ ఆర్థిక వ్యవస్థలో చురుకైన పాత్ర వహించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో బ్యాంకులను జాతీయం చేసినప్పటికీ, పేదలు బ్యాంకు ఖాతాలు తెరవలేకపోయారని మోదీ చెప్పారు. పేద, గిరిజన, వెనుకబడిన తరగతుల వారికి వైద్యం, విద్య, పరిశ్రమ రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వలేని అన్నారు. గిరిజన మహిళ దేశ రాష్ట్రపతి హోదాలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే గత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టిందని చెప్పారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..