Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఆ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రైహన్ వాద్రా కూడా పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు.
ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో ఆయన పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుపుతున్న యాత్రలో భాగంగా ఆయన అక్కడి రైతులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. రాహుల్ తో పాటు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కుటుంబం కూడా ఆ యాత్రలో పాల్గొనడంతో వారిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఖండ్వా జిల్లాలో ఆదివాసీ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాహుల్ గాంధీకి తెలిపారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఆ పాదయాత్ర చేపట్టారని బీజేపీ విమర్శిస్తుండగా, భారత్ ను ఏకం చేయడానికే ఆ యాత్ర చేపట్టామని కాంగ్రెస్ అంటోంది.
एक तेरा कदम, एक मेरा कदम, मिल जाए तो जुड़ जाए अपना वतन।
‘मध्यप्रदेश’ का भी यही संकल्प है।#BharatJodoYatra pic.twitter.com/cyIr1qGx7e
— Congress (@INCIndia) November 24, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..