Mal Reddy Ranga Reddy criticizes TRS MLA Manchireddy Kishan Reddy
Telangana : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు రెండోరోజు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి మరోసారి మంచిరెడ్డిపై విమర్శలు సంధించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను మించిపోయాడంటూ సంచలన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన భూముల్ని కూడా మంచిరెడ్డి లాక్కున్నారని ఆరోపించారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి మంచిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావలని బడుగు బలహీన వర్గాలను బెదిరించి భూములు లాక్కున్నాడని.. ఫార్మాసిటీలో బినామీ పేర్లతో డబ్బులను తీసుకున్నాడని…ఇలా మంచి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు. మంచిరెడ్డి చేసిన అక్రమాలపై తాను ముందే చెప్పానని మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
దళితులు, పేదల భూములు కట్టాలు చేసి, వందల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని ఆరోపించారు. క్యాసినో పేరుతో విలాసాలు సైతం చేస్తున్నారని విమర్శించారు. ఈడీ విచారణలో మంచిరెడ్డి అక్రమ ఆస్తులను మొత్తం బయట పెట్టించాలని కోరారు. కాగా ఫెమా ఉల్లంఘన కేసులో మంచిరెడ్డిని ఈడీ విచారిస్తోంది. దీంట్లో భాగంగా సెప్టెంబర్ 27న ఈడీ అధికారులు తొమ్మిది గంటలపాటు విచారించారు.అనంతరం రెండో రోజు కూడా మంచిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.