Congress President Elections : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో శశిథరూర్ .. నామినేషన్ పత్రాలు తీసుకున్నట్లు వెల్లడి

కాంగ్రెస్ అధ్యక్షపదవి పోటీకి శశీధరూర్ కూడా సిద్ధమవుతున్నారు. నామినేషన్ వేయటానికి కూడా సిద్ధపడ్డారు. కాంగ్రెస్ కేంద్రం ఎన్నిక అథారిటీ చైర్మన్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు శశీధరూర్.

Congress President Elections : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్ష బరిలో నిలిచేదెవరనేదానిపై యావత్ దేశమంతా ఆసక్తితో గమనిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవి పోటీకి సై అంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్షపదవి పోటీకి శశీధరూర్ కూడా సిద్ధమవుతున్నారు. అధ్యక్ష పదవి బరిలో శశీధరూర్ సై అంటున్నారు. శశిథరూర్‌ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. నామినేషన్ వేయటానికి కూడా సిద్ధపడ్డారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ కేంద్రం ఎన్నిక అథారిటీ చైర్మన్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించడంతో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. రెండు దశాబ్దాలత తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించనున్నారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నిక అయితే కాంగ్రెస్​ను బలమైన విపక్షంగా తీర్చిదిద్దుతానని గెహ్లాట్ చెబుతున్నారు. ఫలితం ఏదైనా పార్టీని ఏకం చేసేందుకు తాను కృషి చేస్తానని గహ్లాట్ తెలిపారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎం పదవి ఎవరికి కట్టబెట్టాలో అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి ఇటు అశోక్ గెహ్లాట్ పోటీ చేసే విషయంలో ఖరారు కాగా మరోపక్క ఎంపీ శశిథరూర్ సైతం సై అంటున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

సీనియర్ నేతలు పోటీకి ముందుకు వస్తున్న నేపథ్యంలో…ఇక ఎన్నిక తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఇప్పటికే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికను అక్టోబర్ 17న అన్ని రాష్ట్రాల్లోని పీసీసీల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 8లోగా నామినేషన్లను ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారని పార్టీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు