Telangana TPCC : మాణిక్యం ఠాగూర్ తెలంగాణకు అన్యాయం చేయకు – వీహెచ్
మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కి అన్యాయం చేయకు..తెలంగాణలో ఇన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంత వరకు రివ్యూనే జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 2021, జులై 09వ తేదీ బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
- madhu
- Published On : June 9, 2021 / 02:40 PM IST
Tpcc vh Hanumantha rao
VH Hanumantha Rao : మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కి అన్యాయం చేయకు..తెలంగాణలో ఇన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఇంత వరకు రివ్యూనే జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 2021, జులై 09వ తేదీ బుధవారం ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
ఇప్పుడు ఉన్న నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదని మరోసారి వెల్లడించారు. తమ పార్టీ లో ఎం జరుగుతుందో అర్థం కావడం లేదని, తనను తిడితే కనీసం దాని గురించి మాట్లాడే టైం లేదా ఉత్తమ్ కి అంటూ సూటిగా ప్రశ్నించారు. ఎవర్ని కలవాలో ఎవరితో మాట్లాడాలో తెలియడవం లేదని, హై కమాండ్ ఆలోచన చేయాలి..లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించారాయన. మాణిక్యం ఠాగూర్ కి మళ్ళీ లేఖ రాస్తున్నట్లు.. అందరితో చర్చించాలని కోరుతున్నానని వీహెచ్ వెల్లడించారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరో ఇంకా ప్రకటించకపోవడంతో నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. పీసీసీ విషయంలో తనన కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పినా.. పార్టీ నేతలెవరూ పట్టించుకోవడం లేదని గతంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై టి.కాంగ్రెస్, హై కమాండ్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read More : Mahabubabad : పాపం..చెంబులో తలదూర్చిన కోతి, నీళ్లు తాగడం లేదు..తినడం లేదు
