Prostitution House : వ్యభిచార గృహంపై దాడి-నిర్వాహకులు అరెస్ట్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు
- chvmurthy
- Published On : November 9, 2021 / 03:16 PM IST
Brothal House
Prostitution House : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరి ఖని సప్తగిరి కాలనీకి చెందిన కె. కమార స్వామి(49) ఈసీఐఎల్ ఎంజే కాలనీలోనివసిస్తున్నాడు. ఇతనికి కీసర మండలం టీపీఎస్ కాలనీలో హోటల్ నిర్వహించే అరుణతో పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి వీరిద్దరూ మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టటంతో తమ మకాంని గోధుమకుంట పంచాయతీ పరిధిలోని టీపీఎస్ కాలనీకి మార్చారు. అక్కడ ఇద్దరూ మళ్లీ వ్యాపారం మొదలెట్టారు.
ఆన్ లైన్ లో, సోషల్ మీడియాలో ఫోటోలు పంపిస్తూ విటులను ఆకర్షించి…ఆన్ లైన్ లోనే డబ్బులు వసూలు చేసి కస్టమర్లు అడిగిన చోటకు మహిళలను పంపిస్తూ పోలీసులకు చిక్కకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గత నెల అనారోగ్యంతో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన మహిళ కలకత్తా నుంచి వచ్చి వీరిని ఆశ్రయించింది.
Also Read : Second Wife Kills Husband : పర పురుషులను సుఖపెట్టమంటున్నాడని భర్తను….
ఆ మహిళను బోడుప్పల్ ప్రాంతంలోని ఒక కస్టమర్ వద్దకు పంపించేదుకు సిధ్దమవుతుండగా సమచారం తెలుసుకున్న కీసర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్దనుంచి ఒక కారు, రెండు సెల్ ఫోన్లు, రూ.4వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
