Brij Bhushan Singh Case:మహిళా రెజ్లర్లకు పోలీసుల కొత్త ట్విస్ట్… లైంగిక వేధింపుల కేసులో ఫొటోలు, వీడియోలు, వాట్సాప్ ఛాట్‌ల ఆధారాలివ్వండి

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో న్యూఢిల్లీ పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో ఫిర్యాదులు చేసిన మహిళా రెజ్లర్లు తమ ఆరోపణలకు మద్ధతుగా చిత్రాలు, వీడియోలు లేదా వాట్సాప్ చాట్ సందేశాలను సమర్పించాలని ఢిల్లీ పోలీసులు కోరారు....

Woman Wrestlers

Brij Bhushan Singh Case:భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసులో న్యూఢిల్లీ పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో ఫిర్యాదులు చేసిన మహిళా రెజ్లర్లు తమ ఆరోపణలకు మద్ధతుగా చిత్రాలు, వీడియోలు లేదా వాట్సాప్ చాట్ సందేశాలను సమర్పించాలని ఢిల్లీ పోలీసులు కోరారు.ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను అందజేయాలని ఢిల్లీ పోలీసులు సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు.

Netherlands Town Prohibits Beach: నెదర్లాండ్ బీచ్‌లో జంటలు ఆ పని చేయొద్దు..నిషేధ ఉత్తర్వులు

బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేయాలని భజరంగ్ పునియా డిమాండ్ చేవారు. పోలీసుల దర్యాప్తును తాము విశ్వసించడం లేదని, బీజేపీ ఎంపీని కాపాడే ప్రయత్నం జరుగుతుందని పునియా ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ సింగ్ అక్కడ ఉన్నప్పటికీ పోలీసులు నిన్న ఒక మహిళా రెజ్లర్‌ను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి తీసుకెళ్లారని పునియా చెప్పారు.సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన ఏడుగురు మహిళా రెజ్లర్‌లలో ఒక మైనర్ బాలిక ఒత్తిడితో తన ప్రకటనను మార్చుకుంది.

Amazon forest: అమెజాన్ దట్టమైన అడవిలో పిల్లల ఆచూకీ ఎలా దొరికిందంటే…

సింగ్ మనుషులు ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నారని ఒలింపియన్ సాక్షిమాలిక్ ఆరోపించారు.లైంగిక వేధింపులు జరిగిన సమయంలో తన వయసు తక్కువ కాదని తాజాగా స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనం రేపింది. విచారణను నిర్వీర్యం చేయడానికి, ఫిర్యాదుదారులను, సాక్షులను బెదిరించేంత శక్తి, ప్రభావం నిందితుడికి ఉన్నందున, అతన్ని వెంటనే అరెస్టు చేసి కస్టడీలో ఉంచాలని తాము మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నామని సాక్షిమాలిక్ చెప్పారు.బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ అరెస్ట్‌ లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగదని ఆమె అన్నారు.బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గతంలో లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన అన్ని ఆరోపణలను ఖండించారు.

ట్రెండింగ్ వార్తలు