Allu Arjun – Salman Khan:ఈమధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ మన తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్స్ కొడుతున్నారు.. అడపాదడపా మన తెలుగు పాటల్ని కూడా యధాపలంగా లేపేస్తున్నారు. ఇటీవల కియారా అద్వాణి లీడ్ రోల్ చేసిన ‘ఇందూకీ జవానీ’ మూవీలో రవితేజ ‘ఇడియట్’ సినిమాలోని ‘‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’’ పాటను ట్యూన్‌తో సహా ఎత్తేశారు.
Indoo Ki Jawani : ఎంత కామెడీనో.. ‘ఇడియట్’ ట్యూన్ లేపేశారు!..
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్‌ని కాపీ కొట్టాడని బన్నీ ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘రాధే – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’..
గురువారం రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్లో సల్లూ భాయ్, అల్లు అర్జున్ ‘DJ- దువ్వాడ జగన్నాథమ్’ మూవీలోని ‘సీటీ మార్’ సాంగ్‌లో స్టెప్స్‌ని దింపేశాడు..
Radhe : సల్లూ భాయ్ ‘సీటీ మార్’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీశాడు.. ‘రాధే’ ఈద్ ముబారక్ చెబుతున్నాడు..
దీంతో బన్నీ సాంగ్‌ని ‘రాధే’ టీం కాపీ కొట్టిందని నెటిజన్స్ మండిపడుతున్నారు. దిశా పటానితో భాయ్ జాన్ కనిపించే ఈ పాటలో స్టైలిష్ స్టార్ మాదిరిగానే స్టెప్స్ వేశాడు సల్మాన్..
ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన సాజిద్ వాజిద్, హిమేష్ రేష్మియాలతో పాటు ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ కి కూడా టైటిల్ క్రెడిట్ ఇచ్చారు.. ఒరిజినల్ సాంగ్ క్రియేటివిటీ డీఎస్పీదే కాబట్టి ఓకే కానీ స్టెప్స్ కూడా అలాగే వెయ్యడం ఏంటంటూ సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు..
Extremely happy to be part of this Massive Project ? our #Seetimaar is going to make Bollywood groove?
Thank you @BeingSalmanKhan Bhaai @PDdancing Sir for the opportunity ❤@SKFilmsOfficial @ZeeStudios_ @ReelLifeProdn pic.twitter.com/c7L8K0tgxX
— Jani Master (@AlwaysJani) April 22, 2021
కట్ చేస్తే.. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది తెలుగు ‘సీటీమార్’ సాంగ్ చేసిన జానీ మాస్టరే కావడం విశేషం.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. సల్మాన్, ప్రభుదేవాలకు థ్యాంక్స్ చెప్పారు జానీ మాస్టర్.. సో, ఆ రకంగా ‘సీటీమార్’ పాట, స్టెప్పులు కాపీ కాదు అనే క్లారిటీ వచ్చిందన్నమాట.. రణదీప్ హుడా విలన్‌గా కనిపించనున్న ‘రాధే – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’.. చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ మూవీ విడుదలవుతోంది..