Radhe : సల్లూ భాయ్ ‘సీటీ మార్’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీశాడు.. ‘రాధే’ ఈద్ ముబారక్ చెబుతున్నాడు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన అభిమానులకి, మూవీ లవర్స్‌కి ఈద్ కానుక రెడీ చేశారు. ఈ రంజాన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ చేశాడు సల్లూ భాయ్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘రాధే’ - యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..

10TV Telugu News

Radhe: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన అభిమానులకి, మూవీ లవర్స్‌కి ఈద్ కానుక రెడీ చేశారు. ఈ రంజాన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ డబుల్ చేశాడు సల్లూ భాయ్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..

RADHE

జీ స్టూడియోస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. గురువారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. లేట్ అయినా లేటెస్ట్‌గా ట్రైలర్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు.. సల్మాన్ వన్ మేన్ షో అనేలా ఉన్న ‘రాధే’ ట్రైలర్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది.

RADHE

తన స్టైల్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో పాటు డ్యాన్స్ మూమెంట్స్ ఇరగదీశాడు.. ముఖ్యంగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘DJ- దువ్వాడ జగన్నాథమ్’ మూవీలోని ‘సీటీ మార్’ అనే సాంగ్‌లో స్టెప్స్ కుమ్మేశాడు.. బాంబేలో డ్రగ్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా చూపించారు.

సల్మాన్ సరసన దిశా పటాని కథానాయికగా నటించగా, రణదీప్ హుడా విలన్‌గా కనిపించనున్నాడు. ప్రభుదేవా టేకింగ్, విజువల్స్ బాగున్నాయి.. సాజిద్ వాజిద్, ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్, హిమేష్ రేష్మియా సంగీతమందిస్తున్నారు. మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్.. రిలీజ్ అవనుంది..

×