Cornea Implant From Pig Skin : పంది చర్మంతో కార్నియా చికిత్స..20 మందికి కంటిచూపు ప్రసాదించిన ఢిల్లీ ఎయిమ్స్‌ డాక్టర్లు

ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు కంటిచూపు కోల్పోయిన..అసలు కంటిచూపే లేని పలువురి జీవితాల్లో వెలుగు నింపారు.కార్నియా ఇంప్లాంట్‌లో పంది చర్మాన్ని వినియోగించి భారతీయులతో పాటు ఇరాన్ కు చెందిన రోగులకు కంటి చూపు ప్రసాదించారు.

Cornea Implant From Pig Skin done by Delhi Doctors : పరిశోధకులు మేథాశక్తి ఎంతోమంది ప్రాణాలకు కాపాడుతోంది. చీకటి నిండిన జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తోంది. అలా ఢిల్లీలోని డాక్టర్లు కంటిచూపు కోల్పోయినా..అసలు కంటిచూపే లేని పలువురి జీవితాల్లో వెలుగు నింపారు. కంటిచూపు ప్రసాదించారు. వైద్య రంగంలో వస్తున్న పెను మార్పులతో పంది చర్మంతో 20మందిరిక కంటిచూపు ప్రసాదించారు ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లతో సహా  సహా అంతర్జాతీయ బృందం.

కనుగుడ్డు ముందు భాగాన్ని కప్పి ఉంచే పారదర్శకమైన పొర కార్నియా ఇంప్లాంట్‌లో పంది చర్మాన్ని వినియోగించి భారత పరిశోధకులు విజయవంతమయ్యారు. కార్నియాలో సమస్యతో కంటిచూపునకు దూరమైన భారత్ దేశస్తులతో పాటు ఇరాన్‌ దేశానికి చెందిన 20 మంది రోగులకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స అందించారు.విరాళంగా ఇచ్చిన మానవ కార్నియాల మార్పిడికి ప్రత్యామ్నాయంగా బయో ఇంజినీర్డ్ ఇంప్లాంట్‌ను ఉపయోగించింది.

పంది చర్మాన్ని వినియోగించి తయారుచేసిన కార్నియాను ఇంప్లాంట్‌ చేశారు. దీంతో పేషెంట్లకు కంటిచూపు తిరిగొచ్చింది. ఈ శుభ సందర్భంగా ఎయిమ్స్ డాక్టర్లు మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా 1.27 కోట్ల మంది కార్నియా సమస్యలతో సతమతమవుతున్నారని, అయితే దాతల నుంచి అవసరమైన మోతాదులో కార్నియాలు లభించకపోవడంతో ఎక్కువమంది కంటిచూపునకు దూరమవుతున్నట్టు తెలిపారు. తాజా చికిత్సతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు