Corona Ap
ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 16వ తేదీ శనివారం కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 02 వేల 205 కు చేరుకుంది.
ఇందులో వేయి 353 మంది డిశ్చార్జ్ చేశారు. 49 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 803 గా ఉందని..ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కర్నూలు జిల్లాలో 608 కేసులు చేరగా..కృష్ణాలో 367, గుంటూరులో 413 అత్యధికంగా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో కర్నూలు 09, నెల్లూరులో 09, చిత్తూరులో 08, విశాఖపట్టణం 02, గుంటూరు 01, కడప 01, వెస్ట్ గోదావరి 01 నమోదయ్యాయి. తమిళనాడు నుంచి మొత్తం 31 మంది వచ్చారని హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
జిల్లాల వారీగా : అనంతపురం 122. చిత్తూరు 173. ఈస్ట్ గోదావరి 52. గుంటూరు 413. కడప 102. కృష్ణా 367. కర్నూలు 608. నెల్లూరు 149. ప్రకాశం 63. శ్రీకాకుళం 07. విశాఖపట్టణం 72. విజయనగరం 07. వెస్ట్ గోదావరి 70. ఇతరులు 70.
కోవిడ్ పరీక్షలు : గడిచిన 24 గంటల్లో 09 వేల 628 శాంపిల్స్ పరీక్షించగా..48మందికి పాజిటివ్ ఉందని తేలింది.
డిశ్చార్జ్ అయిన వివరాలు : గడిచిన 24 గంటల్లో 101 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కర్నూలులో 47, అనంతపూర్ లో 37, కృష్ణాలో 05, తూర్పుగోదావరి 03, ప్రకాశం 03, పశ్చిమ గోదావరి 03, కడపలో 02, విశాఖలో 01 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ చేయబడిన వారి సంఖ్య 1353కి చేరింది.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలు : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కర్నూలులో ఒక్కరు చనిపోయారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 49కి పెరిగింది.
Read Here>> ఏపీలో మరో 57 కరోనా కేసులు