Yadadri Bhuvanagiri: కరోనా ‘ఆట’.. 35 మంది యువకులకు పాజిటివ్!

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడగా అక్కడ ఒకరి నుండి మరొకరికి ఇది వ్యాప్తి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు.

Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడగా అక్కడ ఒకరి నుండి మరొకరికి ఇది వ్యాప్తి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. బీబీ నగర్ మండలంల ముగ్ధంపల్లి గ్రామంలో ఈ కరోనా కలకలం రేపింది.

ఒకే కాలానికి చెందిన 35 మంది యువ‌కులు కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడారు. అనంతరం కొద్దిరోజుల తర్వాత కొంత‌మంది యువ‌కులు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతుండంతో అనుమానించిన అధికారులు అంద‌రికీ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గారు.. అందులో 35 మంది యువకులకు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అంద‌రినీ హోం ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కంటికి కనిపించని కరోనా మహమ్మారి సులభంగా ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని అధికారులు చెప్తుండగా యువకులు అది పెడచెవిన పెట్టి ఇలా ఆటలకు దిగడంతో వ్యాధి వ్యాప్తికి అడ్డూ అదుపులేకుండా పోతుంది. ముఖ్యంగా గ్రామాలలో ఆంక్షల అమలు లేక ఇలా ఒకరి నుండి మరొకరి వేగంగా వ్యాప్తి జరుగుతుంది.