కరోనా వైరస్ కు బతికే హక్కు ఉంది..అది మనుష్యుల్లాంటిదే : మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా వైరస్ కూడా మనలాగే మనుష్యుల్లాంటిదేననీ..అదికూడా బతకటానికి పోరాడుతోందనీ..బతికే హక్కు దానికి కూడా ఉందని అందుకే రూపాలు మార్చుకుంటోందని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.

corona virus has a right to life : కరోనా వైరస్ పై ఉత్తరాఖండ్ మాజీ త్రివేంద్ర సింగ్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనలాగే మనుష్యుల్లాంటిదేననీ..అదికూడా బతకటానికి పోరాడుతోందని అందుకే ఆయా వాతావరణాలను బట్టి రూపాలు మార్చుకుంటోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు మనలాగే కరోనా వైరస్ కూడా బతికే హక్కు ఉందని అన్నారు. అది బతకటానికి రూపాలు మార్చుకుంటోందని అన్నారు.

మన మనుగడ కోసం మనం ఎన్నో చేస్తున్నాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎన్నో మెడిసిన్స్ కనిపెడుతున్నాం. అలాగే కరోనా వైరస్ కూడా మనుగడ కోసం రూపాలు మార్చుతోందని..బతకడానికి ప్రయత్నిస్తోందని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు త్రివేంద్ర సింగ్.కాగా..త్రివేంద్ర సింగ్ రావత్ గత మార్చిలో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సొంత పార్టీ బీజేపీ నుంచి వచ్చిన వ్యతిరేకతతో త్రివేంద్ర సింగ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఉత్తరాఖండ్ సీఎంగా తీర్థ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు