ఆంధ్రప్రదేశ్‌ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 2020, మే 09వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 54మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 19 వందల 30కు చేరుకుంది.
ఇందులో 8 వందల 87 మంది డిశ్చార్జ్ చేశారు. 44 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 999 గా ఉందని..ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కర్నూలు జిల్లాలో 553 కేసులు చేరగా..కృష్ణాలో 338, గుంటూరులో 376 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
జిల్లాల వారీగా : అనంతపురం 102. చిత్తూరు 96. ఈస్ట్ గోదావరి 46. గుంటూరు 376. కడప 96. కృష్ణా 338. కర్నూలు 553. నెల్లూరు 96. ప్రకాశం 61. శ్రీకాకుళం 05. విశాఖపట్టణం 62. విజయనగరం 04. వెస్ట్ గోదావరి 67. ఇతరులు 27.
కోవిడ్ పరీక్షలు : గడిచిన 24 గంటల్లో 08 వేల 388 శాంపిల్స్ పరీక్షించగా..43 మందికి పాజిటివ్ ఉందని తేలింది.
డిశ్చార్జ్ అయిన వివరాలు : గడిచిన 24 గంటల్లో 45 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కర్నూలు 27. కృష్ణా 08. గుంటూరు 04. తూర్పుగోదావరి 03. అనంతపురం 02. నెల్లూరు 01 డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 887 మంది డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలు : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ముగ్గురు కోవిడ్ వైరస్ తో చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఒక్కరు మరణించారని వెల్లడించింది. కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 44కి చేరుకుంది.
Read More :
* ఏపీలో కరోనా అప్‌డేట్: 1887కి చేరిన కరోనా కేసులు
* విజయనగరం జిల్లాలో తొలిసారి మూడు కరోనా కేసులు..ఏపీలో 1833కి చేరిన పాజిటివ్ కేసులు