ఇండియాకు Oxford కరోనా వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడంటే?

  • Publish Date - October 28, 2020 / 10:08 PM IST

Coronavirus Vaccine in India : భారత్‌లోని సీరం ఇనిస్టిట్యూట్‌, ఆస్ర్టాజెనెకా అభివృద్ధి చేస్తున్న Oxford coronavirus వ్యాక్సిన్‌ డిసెంబర్‌ నాటికి రెడీ అవుతుందని పుణేకు చెందిన చీఫ్‌ ఆదార్‌ పూనావాలా వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం చేసుకుంది.



పది కోట్ల వ్యాక్సిన్‌ డోసులతో తొలి బ్యాచ్‌ 2021 రెండు లేదా మూడో త్రైమాసికంలో అందరికి అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో డిసెంబర్‌ నాటికి హ్యుమన్ ట్రయల్స్ పూర్తి అవుతాయని చెప్పారు.

బ్రిటన్‌లో ట్రయల్స్ ముగిసిన పక్షంలో భారత్‌లో జనవరి నాటికి వ్యాక్సిన్‌ లాంచ్ చేస్తామని జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదార్‌ పూనావాలా పేర్కొన్నారు.



బ్రిటన్‌లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్‌ పరీక్షలు పూర్తికానున్నాయని చెప్పారు. వ్యాక్సిన్‌ సామర్థ్యంతో పాటు భద్రత మెరుగ్గా ఉందని అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామన్నారు. దీనిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.



వ్యాక్సిన్‌ పూర్తిస్ధాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. తొలిబ్యాచ్‌గా 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను వచ్చే ఏడాది రెండు, మూడు త్రైమాసికాల్లో మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.