Cover With a Tarpaulin : మంచునది కరిగిపోకుండా టార్పాలిన్ క్లాత్ తో కప్పేస్తున్నారు

మంచు కరగకుండా నిరోధించేందుకు, వేడి కిరణాలు పడకుండా ఉండేందుకు వీలుగా మంచునదిపై మందం కలిగిన టార్సాలిన్ వస్త్రాలను కప్పేందుకు పూనుకున్నారు.

మంచునది కరిగిపోకుండా....

Cover With a Tarpaulin : మనుషులకు చలివేస్తే దుప్పటి కప్పుకుంటాం… కాని వేడి కారణంగా కరిగిపోతున్న ఓ మంచుతో కూడిన నదిని కాపాడుకునేందుకు అక్కడి వారు ఏంచేశారో తెలిస్తే ఆశ్ఛర్య పోతారు. ప్రస్తుతం కాలంలో వాతావరణ సమతుల్యత దెబ్బతినటం కారణంగా పర్యావరణ పరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది ఒకరకంగా పర్యావరణ వేత్తలను కలవరపాటుకు గురిచేస్తుంది. ఉత్తర ఇటలీలో ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. వేడి అధికం కావటంతో అక్కడ ఉన్న ప్రెసేనా హిమనీనది క్రమేపీ కరిగిపోతుంది.

దీనిని ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించుకున్న ఇటలీ వాతావరణ శాస్త్రవేత్తలు తెలివైన ఆలోచన చేశారు. మంచు కరగకుండా నిరోధించేందుకు, వేడి కిరణాలు పడకుండా ఉండేందుకు వీలుగా మంచునదిపై మందం కలిగిన టార్సాలిన్ వస్త్రాలను కప్పేందుకు పూనుకున్నారు. 120,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న దీనిని కప్పేందుకు వారికి నెలరోజుల సమయం పట్టనుంది. 1993 నుండి ప్రెసేనా హిమనీనది వేడి కారణంగా ఒక వంతు మంచును కోల్పోయింది.

మంచునది కరిగిపోకుండా 2008 సంవత్సరం నుండి ఇలా టార్ఫాలిన్ తో కప్పే చర్యలను ఇటలీ శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఈ చర్య ద్వారా వారు కొంత మేర సత్ఫలితాలను చూడగలిగారు. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ కారణంగా యూఎస్, కెనడాలో పెద్ద ఎత్తున మంచుతో కూడిన నదులు కరిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిస్ధితి ఇదే విధంగా ఉంటే 2200 సంవత్సరం నాటికి హిమనీనదాలు పూర్తిగా అంతర్ధానం అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హిమనీ నదులు కరగకుండా ఇటలీ వాతావరణ శాస్త్రవేత్తలు చేపడుతున్న చర్యలను పర్యావరణ వేత్తలు హర్షిస్తున్నారు.