Covovax: చిన్నారుల కోసం కోవోవాక్స్ సిద్ధం: అదర్ పూనావాలా

దేశంలోని చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా.

Covovax

Covovax: దేశంలోని చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా. దేశానికి చెందిన వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం సంస్థ కోవిడ్ కోసం రూపొందించిన రెండో వ్యాక్సిన్ ఇది. పెద్దవాళ్ల కోసం ఇంతకుముందు ఈ సంస్థ ‘కోవీషీల్డ్’ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా చిన్నారుల కోసం కోవోవాక్స్ తయారు చేసింది. ఇది 12-17 ఏళ్లలోపు పిల్లలపై పనిచేస్తుంది.

Vaccination: ఒక్కరికీ వ్యాక్సిన్ బలవంతంగా వేయడానికి లేదు – సుప్రీం కోర్టు

ఇప్పటికే దేశవ్యాప్తంగా పిల్లల కోసం వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇకపై ఈ డ్రైవ్‌లో భాగంగా కోవోవాక్స్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ భారత దేశంతోపాటు యూరప్‌లోనూ వినియోగిస్తున్నట్లు అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ చొరవ వల్ల ఈ వ్యాక్సిన్ తయారీ సాధ్యమైందని పూనావాలా చెప్పారు. దేశంలోని చిన్నారులకు కోవిడ్ నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతుందన్నారు.