Rajiv Gandhi assassination case: నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని.. రాజీవ్ హత్య తరువాత మూడు రోజులు విపరీతంగా ఏడ్చా.. నళిని శ్రీహరన్

ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మేము రోజంతా ఏమీ తినలేదు. నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నాం. రాజీవ్‌గాంధీ చనిపోయినప్పుడు కూడా నేను మూడు రోజులు ఏడ్చా. కానీ నేను రాజీవ్ గాంధీని చంపినట్లు ఆరోపణను మోస్తున్నాను. ఆ ఆరోపణ క్లియర్ అయితేనే నేను విశ్రాంతి తీసుకుంటాను అని నళిని శ్రీహరన్ అన్నారు.

Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని హత్య జరిగినప్పుడు నేను మూడు రోజులుపాటు విపరీతంగా ఏడ్చానని తెలిపింది. నేను కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని, కానీ రాజీవ్ గాంధీని హత్య కేసులో ఆరోపణతో జైలు జీవితం గడాల్పి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసింది.

Rajiv Gandhi Assassination: రాజీవ్ హత్య గురించి అడిగి ప్రియాంక బోరున విలపించారు.. నళిని శ్రీహరన్

ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మేము రోజంతా ఏమీ తినలేదు. నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నాం. రాజీవ్‌గాంధీ చనిపోయినప్పుడు కూడా నేను మూడు రోజులు ఏడ్చా. కానీ నేను రాజీవ్ గాంధీని చంపినట్లు ఆరోపణను మోస్తున్నాను. ఆ ఆరోపణ క్లియర్ అయితేనే నేను విశ్రాంతి తీసుకుంటాను అని నళిని శ్రీహరన్ అన్నారు. నువ్వు నిర్దోషివి అయితే మాజీ ప్రధాని హత్య వెనుక ఎవరున్నారన్న ప్రశ్నకు.. నళిని సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. నేను అలా ఎవరినీ సూచించలేను. అలాచేసి ఉంటే నేను 32ఏళ్ల పాటు జైలులో ఉండేదానిని కాదు అంటూ ఆమె పేర్కొన్నారు.

Rajiv Gandhi Assassination: 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన రాజీవ్ హంతకులు నళిని, ఇతరులు

రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన నలుగురు దోషులు ఉన్న తిరుచ్చి ప్రత్యేక శిబిరాన్ని నళిని శ్రీహరన్ సందర్శించారు. ఈ ప్రత్యేక శిబిరంలో మురుగన్, సంతన్, రాబర్ట్ పాయస్, జయకుమార్ ఉన్నారు. ఈ నలుగురూ ప్రస్తుతం బహిష్కరణను ఎదుర్కొంటున్నారు. అయితే, వారు వెళ్లాలనుకునే ప్రదేశాలకు పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నళిని కోరారు. మా కూతురు హరిత నివసించే దేశానికి మురుగన్ (నళిని భర్త)ని పంపించమని నేను కలెక్టర్‌ని కోరాను. సంతాన్ శ్రీలంక వెళ్లాలనుకుంటున్నాడు, మిగిలిన ఇద్దరు ఇంకా నిర్ణయించుకోలేదని నళిని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు