Crocodile Enters House : కృష్ణా నదీ తీరంలోని ఇంట్లోకి వచ్చిన మొసలి…ఆపై ఏం జరిగిందంటే…
నదిలో ఉన్న ఓ మొసలి ఏకంగా ఇంట్లోకి వచ్చిన ఘటనతో ప్రజల్లో తీవ్ర కలకలం చెలరేగిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణానదీ తీరంలోని శక్తినగర్ గ్రామంలో వెలుగుచూసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు మొసలిని తాళ్లతో బంధించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు....
- saleem sk
- Published On : July 7, 2023 / 04:31 AM IST
ఇంటికి వచ్చిన మొసలి
Crocodile Enters House : కృష్ణానదిలో నుంచి ఓ మొసలి ఒడ్డున ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. కృష్ణానదిలో ఉన్న మొసలి తీరంలోని ఇంట్లోకి రావడం కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని శక్తినగర్ గ్రామంలో (Karnataka Shaktinagar) ఏకంగా నదిలో నుంచి ఇంట్లోకి వచ్చిన మొసలిని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం షాక్ నుంచి కోలుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Narendra Modi : రేపే తెలంగాణకు ప్రధాని మోదీ.. వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారు
హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు మొసలిని తాళ్లతో బంధించారు. మొసలిని తాళ్లతో బంధించిన అది కదులుతుండటంతో స్థానికులు తీవ్రంగా భయపడ్డారు. అనంతరం మొసలిని ఇంటి నుంచి తీసుకువెళ్లి కృష్ణానదిలోనే వదిలేశారు. కృష్ణా నదీ తీరానికి సమీపంలో ఉన్న 70 గ్రామాల్లో తరచూ మొసళ్లు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు సాగుతున్నాయి.
