Curry Leaves Benefits : రక్తంలో కొలెస్ట్రాల్‌ ని కంట్రోల్ చేసే కరివేపాకు..

ఉప్మాలో ఏరి పారేసే కరివేపాకు కొలెస్ట్రాల్ ను ఎలా కంట్రోల్ చేస్తుందో తెలుసా?

Health Tips..Curry Leaves Benefits: ఉప్మాలో కరివేపాకులా తీసిపారేసారు అనే మాట తరచు వింటుంటాం. సరైన విలువ ఇవ్వకపోయినా..చులకనగా చూసినా అలా అంటుంటారు. కానీ నిజానికి కరివేపాకు విలువ లేనిది ఎంత మాత్రం కాదు. పైగా మన ఆరోగ్యానికి చాలా చాలా విలువైనది. కానీ ఉప్మాలో కరివేపాకులా తీసిపారేశారు అనే మాట ఎందుకొచ్చిందంటే..కరివేపాకు లేకుండా ఉప్మా చేయం. కానీ తినేటప్పుడు మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టి తింటాం. కానీ అలా చేయొద్దు. ఎందుకంటే కరివేపాకు మనిషి ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగం.

Read more : Health Juices : ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ లు ఇవే..

ఉప్మాలోనే కాదు పప్పు తాలింపులో కరివేపాకు, చారులో కరివేపాకు.తీసి పక్కన పెట్టేసి అన్నం తింటాం. కానీ కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే ముందు దాన్నే తింటారు. కూరలో కరివేపాకు కనిపిస్తే తీసేయకుండా తింటారు. కరివేపాకులో పోషకాలు అన్నీ ఇన్నీ కావు.మరి కరివేపాకు విలువేంటో..దాని ఉపయోగాలేంటో తెసుకుందాం..తెలుసుకున్నాక తినకుండా మాత్రం మానొద్దు.మన భారతీయ ఆహార అలవాట్లలో కరివేపాకుకు విశిష్ట స్థానం ఉంది. సాంబార్‌ నుంచి పెరుగు చట్నీ వరకు ప్రతి కూరలో దర్శనమిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతంలో కరివేపాకు లేకుండా కూరలను అసలు ఊహించలేమంటే అతిశయోక్తి కాదేమో! కేవలం రుచి కి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దీనిలో మెండేనండోయ్‌.

కరివేపాకుతో ప్రయోజనాలు..
కరివేపాకు పొడి ప్రతీరోజు ఒక్క స్పూన్ తింటే డయాబెటిస్ పరార్ అని నిపుణులు చెబుతున్నారు.కరివేపాకులో విటమిన్‌ ‘ఎ’, ‘సి’, పొటాషియం, కాల్షియం, ఫైబర్‌, రాగి, ఐరన్‌ వంటి భిన్న రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువును కంట్రోల్ లో ఉంచటంలో కరివేపాకుని మించినందే లేదంటారు ఆరోగ్యనిపుణులు. అంతేకాదు మధుమేహాన్ని కంట్రలో చేయటంలో దీనికిదే సాటి. దీనికి ఎవరు రారు పోటీ అన్నంత ఉపయోగాలు కరివేపాకుతో. చక్కటి జీర్ణశక్తికి కూడా ఈ ఆకులు ఎంతో మంచిది. అలాగే పేగుల్ని శుభ్రపరచటంతో ఇది భలే పనిచేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ ని బయటకు పంపించటంలో కూడా కరివేపాకు చక్కగా ఉపయోగపడుతుంది.

Read more : Health Juices : ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ లు ఇవే..

కరివేపాకుతో అధిక కొవ్వుల నివారణ..
శరీరంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్‌ ను బయటకు పంపేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని కంట్రోల్ చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల్ని నివారిస్తుంది. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ చైనీస్‌ మెడిసిన్‌ అధ్యనాల ప్రకారం.. రక్తంలోని గ్లూకోజ్‌, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించే గుణం కరివేపాకు రసంలో పుష్కలంగా ఉన్నాయి తెలిపారు.పరిశోధకులు డయాబెటిక్‌ ఎలుకలకు వరుసగా 10 రోజుల పాటు కరివేపాకు రసాన్ని ఇంట్రాపెరిటోనియల్‌ ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చారు. తద్వారా వీటి రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోస్‌ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. కాబట్టి ప్రతీరోజు ఆహారంలో భాగంగా కరివేపాకు ఆకులను తినాలి. లేదా పొడిరూపంలో కూడా రోజుకు ఓ స్పూన్ కడుపులోకి వెళ్లేలా చూసుకోవాలి. అలా చేస్తే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరాయిడ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయని తెలిపారు.

రోజువారీ ఆహారంలో కరివేపాకు..
కరివేపాకు ఎలా తీసుకోవాలి? కూరల్లోనా? పొడులుగానా? ఎలా తీసుకున్నా ప్రతీరోజు కరివేపాకు తీసుకోవాలి. కానీ కరివేపాకు అంటే నిర్లక్ష్యం. దీంతో ఏరిపక్కన పెట్టేస్తుంటారు. అలా చేస్తే మనకు ఉపయోగపడేదాన్నివద్దు అనుకున్నట్లే. మరి ఈ కరివేపాకుని ఎలా ఆహారంలో చేర్చుకోవాలంటే..8-10 కరివేపాకు ఆకులు, చిన్న అల్లం ముక్కను నీళ్లలోవేసి 15 నుంచి 20 నిముషాలు మరిగించండీ.. మూతను పెట్టి 10 నిముషాలు పక్కన పెట్టండి.

Read more : Bone Health : ఎముకల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పండ్లు, ఆకుకూరలు ఇవే!..

తర్వాత దాన్ని వడకట్టి తాగండి. టేస్ట్ కోసం ఓ నిమ్మచెక్క పిండండీ. ఇష్టమైతే దానికి ఓ స్పూన్ తేనెకూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన కరివేపాకు టీ అంటారు. దీన్ని ప్రతీరోజు ఒకటి రెండు కప్పులు తాగితే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ బలాదూర్ అయిపోతుంది. రోజులో ఎప్పుడైనా ఈ కరివేపాకు టీ తాగొచ్చు.అలాగే మన రోజువారీ వంటకాల్లో కరివేపాకును వాడుకోవచ్చు. కరివేపాకు పచ్చడి,పొడి, రైస్, లస్సీ రూపం ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు.

ప్రతి రోజూ పిడికెడు కరివేపాకు ఆకులను నేరుగా తింటే ఇంకా మంచిది. అలా తినలేకపోతే..గుప్పెడు కరివేపాకు ఆకుల్ని అన్నం వండేటప్పుడు కుక్కర్ లో పడేస్తే అన్నానికి చక్కటి సువాసన వస్తుంది. తద్వారా కరివేపాకుని కడుపులోకి పంపినట్లు ఉంటుంది. జుట్టుకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు