Health Juices : ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ లు ఇవే..

జాతీయ పోషకాహార మాసోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిఒక్కరు పోషకాహారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైన ఉంది. రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్ధాలను తీసుకోవటం అన్నది

Health Juices : ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ లు ఇవే..

Juice

Health Juices : కోవిడ్ ప్రభావంతో అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరుగుతుంది. శరీరానికి ఎలాంటి ఆహారం కావాలి. ఎది తింటే మంచిది. ఏది తినకూడదు అన్న విషయంపై చాలా మంది వెనకా ముందు ఆలోచించుకుంటున్నారు. శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవటంపైనే అందరిదృష్టి ఉంది. ఇమ్యునిటీ పెంచుకునేందుకు కావాల్సిన ఆహారాన్ని మాత్రమే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో మాదిరిగా శరీరానికి ఏమాత్రం ఆరోగ్యదాయంకం కాని ఆహారాన్ని తినేందుకు  ఇష్టం చూపించటంలేదు. మంచి ఆహారాన్ని శరీరానికి అందించటం అన్నది చాలా ముఖ్యం. ఇలా చేయటం వల్ల వ్యాధుల భారి నుండి మనల్ని మనం కాపాడుకోవటంతోపాటుగా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.

జాతీయ పోషకాహార మాసోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిఒక్కరు పోషకాహారంపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైన ఉంది. రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్ధాలను తీసుకోవటం అన్నది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఉదయం పోషకాలతో కూడిన జ్యూస్ లను తాగటం వల్లా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి జ్యూస్ ల గురించి మనం తెలుసుకుందాం. ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని జ్యూస్‌ రూపంలో సైతం మనశరీరానికి అందిచవచ్చు. పాల కూర, లెట్యూస్‌ ఆకులు లేద కాలే తో జ్యూస్‌ చేసుకుని తాగవచ్చు. పచ్చగా, చేదుగా అనిపించటం వల్ల తాగలేని వారు అందులో కొంచెం చక్కెరను కలుపుకుని తీసుకోవచ్చు.ఇలా తయారుచేసుకున్న జ్యూస్‌ ప్రతి ఉదయం తాగడం ద్వారా శరీరానికి అనేక పోషకాలను అందించడంతోపాటు మీ ఇమ్యునిటీని కూడా పెంపొందిస్తుంది. శరీర బరువును తగ్గించటంలో ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ జ్యూస్‌ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తుంది.

బొప్పాయి ముక్కలతో చేసిన జ్యూస్‌లో, నానబెట్టిన హలిమ్‌ విత్తనాలను కలుపుకుని తాగవచ్చు. బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌లో ఏ, సి, ఇ విటమిన్లతో పాటు ఐరన్‌, కాల్షియమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ మిశ్రమంలో కొంచెం అల్లం, పసుపు కలిపి తీసుకోవడం ద్వారా మీ రోగనిరోధకత పుంజుకుంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌తో బాధపడేవారికి ఈ జ్యూస్‌ ఉపశమనాన్నిస్తుంది. మన దేశంలో ఎ‍క్కడైనా దొరికే ఔషధ ఫలం వెలగపండు. వెలగపండును జ్యూస్ చేసుకుని తాగవచ్చు.ఈ పండులో ఫైబర్‌, విటమిన్‌ సి లతోపాటు చాలా పోషకాలతో నిండి ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపకరించే ఈ వెలగపండు జ్యూస్‌ వడదెబ్బ నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. కొకుమ్‌ ఫలాలు, అంజీర పండ్ల రసంలో జీలకర్ర పొడి, బ్లాక్‌ సాల్ట్‌ను కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్‌లో ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంత చల్లటి నీటిని చేర్చి రోజు మొత్తంలో మీరు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు సేవించవచ్చు. ఉదయం సమయంలో ఈ జ్యూస్ లను తీసుకోవటం వల్ల రోజంతా మీరు ఎంతో ఉత్సహాంగా ఉండేలా చేస్తాయి. మెదడు చురుకుదనంగా పనిచేస్తుంది.