Dasoju Shravan : రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ లో అరాచక పరిస్థితులు : దాసోజు శ్రవణ్

కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దాసోజు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వల్లే పార్టీ వదులుతున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిపాటు కడుపులో దాచుకున్నా..ఇక తన వల్ల కాదన్నారు.

Dasoju Shravan : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దాసోజు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వల్లే పార్టీ వదులుతున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిపాటు కడుపులో దాచుకున్నా..ఇక తన వల్ల కాదన్నారు. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు5,2022) నిర్వహించిన ప్రెస్ మీట్ లో పార్టీ వీడుతున్నట్లు దాసోజు ప్రకటించారు.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని దాసోజు శ్రవణ్ అన్నారు. 130 ఏళ్ల పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏడాదికాలంగా కాంగ్రెస్ లో మార్పులు వచ్చాయని చెప్పారు. రేవంత్ వచ్చాక కులం, ధనం అనే పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ లో పరిస్థితులు చూస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపినట్లు పేర్కొన్నారు.

Dasoju Shravan Resign : కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ రాజీనామా..రేవంత్ వల్లే పార్టీ వీడుతున్నా

సొంత పార్టీ వాళ్లే సొంత పార్టీ నేతలను బలహీనపర్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. పార్టీ నేతలను రేవంత్ రెడ్డి బలహీనపర్చే ప్రయత్నం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. కంచె చేను మేసినట్లు టీపీసీసీ చీఫ్ పార్టీని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ప్రతీ నియోజకవర్గంలో వ్యక్తిగత ప్రాబల్యం కోసం రేవంత్ పాకులాడుతున్నారని విమర్శించారు.

ఒక్కో నియోజకవర్గంలో ఐదారుగురిని రేవంత్ ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. సోబర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబర్ పార్టీగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ ను రేవత్ ప్రైవేట్ ప్రాపర్టీగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఫ్రాంఛైజీని కొనుక్కున్నట్టుగా రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదేం పరిస్థితి? ఇదేం ఫ్రాంఛైజీ సిస్టం? అని ప్రశించారు.

 

ట్రెండింగ్ వార్తలు