Delhi Cab Driver: సంస్కృత భాష మాట్లాడేవారు ప్రస్తుత కాలంలో కేవలం 1 శాతం మంది మాత్రమే ఉన్నారు. సంస్కృత భాషను అధికంగా పూజారులు హిందూ మత వేడుకల సమయంలోనే మంత్రాలు చదివేటప్పుడు వాడుతున్నారు. ప్రస్తుత కాలంలో ఎవరైనా సంస్కృత భాషలో మాట్లాడుకుంటే వారిని జనాలు విచిత్రంగా చూసే పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఇద్దరు వ్యక్తులు సంస్కృత భాషలో మాట్లాడుకుంటూ కారులో ప్రయాణించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాను సంస్కృత భాషలో ఒకరితో మాట్లాడానంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘అద్భుతం ఢిల్లీలోని ఈ కారు డ్రైవర్ ఇవాళ ఉదయం నాతో సంస్కృతంలో మాట్లాడాడు’’ అని పేర్కొన్నారు. క్యాబ్ డ్రైవర్, ప్రయాణికుడు సంస్కృతంలో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఈ వీడియో అందరినీ అలరిస్తోంది.
ప్రయాణికుడు అడుగుతున్న ప్రశ్నలకు క్యాబ్ డ్రైవర్ సంస్కృతంలోనే సమాధానం చెబుతూ కారును నడిపించాడు. తన పేరు అశోక్ అని, తనది ఉత్తరప్రదేశ్ లోని గోండా సొంత ప్రాంతమని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. అతడి కుటుంబ సభ్యుల వివరాలను కూడా ప్రయాణికుడు అడిగాడు. దీంతో ఆయా వివరాలు అన్నింటినీ క్యాబ్ డ్రైవర్ సంస్కృతంలోనే చెప్పాడు.
Amazing !!
This car driver in Delhi speaks Sanskrit with me this morning!! pic.twitter.com/z6XU8B9glk— LAKSHMI NARAYANA B.S (BHUVANAKOTE) (@chidsamskritam) November 10, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..