judge protest : సుప్రీంకోర్టు ముందు జడ్జి అర్థ నగ్న నిరసన..ఎందుకంటే..

సుప్రీంకోర్టు ముందు జడ్జి అర్థ నగ్న నిరసన చేపట్టారు. ఓ న్యాయమూర్తి దేశ అత్యున్నత ధర్మాసనం ముందు అర్థ నగ్న నిరసన చేపట్టటం చర్చనీయాంశంగా మారింది.

judge protest : ఆయనొక జడ్జి. ఎన్నో కేసుల్లో తీర్పునిచ్చిన న్యాయమూర్తి. కానీ ఆయన కూడా సుప్రీంకోర్టు ముందు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు ముందు అర్థనగ్నంగా నిరసన చేస్తున్న వ్యక్తి ఓ జడ్జి అని తెలిసి అక్కడ ఉన్న పోలీసులు షాక్ అయ్యారు. ‘ఇదేంటీ సార్..మీరేంటీ ఇక్కడ..ఇలా దయచేసి నిరసన ఆపండీ సార్’అంటూ కోరారు.ఇంతకీ ఓ న్యాయమూర్తి న్యాయస్థానం ముందు అర్థ నగ్నంగా నిలబడి ఆందోళన ఎందుకు చేశారంటే..

ఒక జిల్లా కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు ముందు తన చొక్కా తీసి విచిత్రమైన నిరసనను ప్రదర్శించిన ఘటన ప్రజలను ఆకర్షించింది. ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అతను నిరాశకు గురైయ్యారట..సదరు న్యాయమూర్తి. అందుకే తన అసంతృప్తిని ప్రదర్శించటానికి షర్టు తీసివేసి నిరసన తెలిపారు.

సుప్రీంకోర్టు మెయిన్ గేటు దగ్గర ఓ వ్యక్తి అర్ధనగ్నంగా కూర్చోవడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది.. ఆయన దగ్గరకు వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. నిరసనను ఆపాల్సిందిగా కోరారు. అయితే, అందుకు ఆయన నిరాకరించారు. జడ్జి చాలా సేపు అక్కడే కూర్చున్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఆయన్ని పదే పదే బతిమిలాడారు.మీరో జడ్జి మీకు చెప్పాలా సార్..దయచేసి ఈ నిరసన ఆపండీ అంటూ చాలాసేపు బతిలాడిన తర్వాత ఆయన షర్టు వేసుకున్నారు. కాసేపటికి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

కానీ ఆయన నిరసన తెలపడానికి వెనుక కారణం ఏంటీ. ఏ తీర్పు విషయంలో ఆయన అసంతృప్తి చెందారు?వంటి విషయాలు అధికారులు వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిరసనకు దిగారని మాత్రమే తెలిపారు. అది న్యాయమూర్తి వ్యక్తిగత విషయమని పేర్కొంటూ అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.

 

ట్రెండింగ్ వార్తలు