Bone Strength : సీజనల్ ఫ్రూట్స్ తో సహజంగా ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు తెలుసా!

స్ట్రాబెర్రీలో ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి ఎముక‌లు గుల్ల‌గా మార‌డాన్ని అడ్డుకుంటాయి. అలాగే స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ కే, విటమిన్ సీ ఎక్కువ‌గా ఉంటాయి.

Bone Strength : సీజనల్ ఫ్రూట్స్ తో సహజంగా ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు తెలుసా!

bone strength with seasonal fruits

Bone Strength : శరీరానికి ఒక ఆకృతిని ఇచ్చేవి ఎముకలు. ఏప‌ని చేయాల‌న్నా ఎముకలు బ‌లంగా ఉండాలి. నిల‌బ‌డాల‌న్నా, కూర్చోవాల‌న్నా,ప‌రుగెత్తాల‌న్నా, న‌డవాల‌న్నా ఎముకలే పటుత్వమే కీలకం. ఎముక‌లు బ‌లంగా ఉండేందుకు మంచి ఆహారం తినాలి. అయితే సహజంగా ఎముకల బలాన్ని పెంచుకునేందుకు అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవటం చాలా అవసరం. పండ్లను తీసుకోవటం ద్వారా ఎముకలను ధృడంగా మార్చుకోవచ్చు.

యాపిల్ ; యాపిల్‌లో ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అందుకే ప్ర‌తిరోజు యాపిల్ తింటే డాక్ట‌ర్ అవ‌స‌రం రాద‌ని అంటారు. ఎముక‌లు బ‌లంగా ఉండేందుకు, కొత్త ఎముక క‌ణాలు ఉత్ప‌త్తి అయ్యేందుకు దోహ‌ద‌ప‌డే విట‌మిన్ సీ ఇందులో పుష్క‌లంగా ల‌భిస్తుంది.

స్ట్రాబెర్రీ ; స్ట్రాబెర్రీలో ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి ఎముక‌లు గుల్ల‌గా మార‌డాన్ని అడ్డుకుంటాయి. అలాగే స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ కే, విటమిన్ సీ ఎక్కువ‌గా
ఉంటాయి. ఇవి ఎముక‌ల కణాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

పైనాపిల్ ; ఎండాకాలంలో దొరికే పైనాపిల్‌లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీరంలోని యాసిడ్ లోడ్‌ను నియంత్రించి.. కాల్షియం లోటును త‌గ్గిస్తుంది. అంతేకాకుండా పైనాపిల్‌లో విట‌మిన్ ఏ, కాల్షియం ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఎముక‌ల పుష్టికి దోహ‌ద‌ప‌డుతాయి.

బొప్పాయి ; బొప్పాయిని కొంచెం తిన్నా శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎముక‌లను దృఢంగా చేసేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌ల ఆరోగ్యానికి కావాల్సిన విట‌మిన్ సీ ఇందులో పుష్క‌లంగా ల‌భిస్తుంది. బొప్పాయి తింటే చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ శ‌క్తి పెరుగుతుంది.

ట‌మాటా ; ట‌మాటాల్లో విట‌మిన్ కే, కాల్షియం, లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎముక‌ల బ‌లానికి ఇవి ఉప‌యోగ‌ప‌డతాయి.

అరటి పండు ; అరటిపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ అరటిపండ్లు తీసుకోవడం మంచిది. రోజూ అరటిపండు తింటే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి.

నారింజ పండు ; ఆరెంజ్ జ్యూస్ శరీరానికి కాల్షియం, విటమిన్ డిని అందిస్తుంది. ఇది ఎముకలని బలంగా చేయడంలో సాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ పండ్లు, జ్యూస్‌ని తీసుకోవడం వల్ల బోలు ఎముకల సమస్యని తగ్గించుకోవచ్చు.

అలాగే ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి కాల్షియం, విటమిన్‌ డి చాలా అవసరం. వీటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి తోడ్పడతాయి. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. అన్ని రకాల కూరలు, పళ్ళు, ఆకుకూరలు, పాలు, పెరుగు కలిగిన సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా దృఢంగా ఉంటాయి.