Dinesh
Sri lanka: శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్ గుణవర్ధన ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు రణిల్ విక్రమసింఘే ప్రధానిగా, కొన్ని రోజులుగా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. నిన్న రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రధాని పదవి దినేశ్ గుణవర్ధనను వరించింది. శ్రీలంక విపక్ష నేత సజిత్ ప్రేమదాస ప్రధాని అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు.
రణిల్ విక్రమసింఘే సన్నిహితుడిగా దినేశ్ గుణవర్ధనకు పేరు ఉంది. అలాగే, శ్రీలంకలోని రాజపక్సల కుటుంబాలతోనూ దినేశ్ గుణవర్ధన స్నేహపూర్వకంగా ఉంటారు. రాజపక్సల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న రణిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా ఉండవద్దంటూ ఆ దేశంలో మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఎమర్జెన్సీ విధించినప్పటికీ నిరసనలు ఆగట్లేదు. ఆందోళనకారులు వేసుకున్న శిబిరాలను శ్రీలంక సైన్యం బలవంతంగా తొలగిస్తోంది.
YouTube: అబార్షన్లు చేసే ప్రక్రియపై తప్పుడు సమాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చర్యలు