Anudeep KV : దయచేసి నన్ను ఎవరూ నటించమని అడగొద్దు.. నా నెక్స్ట్ సినిమా..
తాజాగా ప్రిన్స్ సినిమా హిట్ అయిన సందర్భంగా పలు సక్సెస్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు డైరెక్టర్ అనుదీప్. ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ....
- Saketh U
- Published On : October 23, 2022 / 01:17 PM IST
Director Anudeep about Acting in Movies
Anudeep KV : జాతిరత్నాలు సినిమాతో బాగా పాపులర్ అయిపోయాడు డైరెక్టర్ అనుదీప్. అనుదీప్ స్పీచ్ లు, క్రేజీ ఆన్సర్స్, షోలలో ఎంటర్టైన్మెంట్ తో హీరోలతో సమానంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక జాతిరత్నాలు తర్వాత శివకార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రిన్స్ సినిమా దివాళీ కానుకగా అక్టోబర్ 21న విడుదలై మంచి విజయం సాధించింది. జాతిరత్నాలు లాగే ప్రిన్స్ కూడా ఫుల్ ఫన్ తో సాగడంతో తెలుగు, తమిళ్ రెండు చోట్ల మంచి విజయం సాధించింది.
తాజాగా ప్రిన్స్ సినిమా హిట్ అయిన సందర్భంగా పలు సక్సెస్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు డైరెక్టర్ అనుదీప్. ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ.. ”నాకు సినిమాల్లో నటించాలని లేదు. నాగ్ అశ్విన్ అడగడం వల్ల జాతిరత్నాలు సినిమాలో కనిపించాను. ప్రిన్స్ సినిమాలో కూడా శివ కార్తికేయన్ అడగడం వల్ల చివర్లో అలా కనిపించాను. ఇకపై సినిమాల్లో కనిపించను, నటించను. దయచేసి నన్ను ఎవరూ సినిమాల్లో నటించమని అడగొద్దు కూడా” అని తెలిపాడు.
IFFI 2022 : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కించుకున్న అఖండ, RRR, మేజర్..
అలాగే తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ”కొన్ని కథలు ఉన్నాయి. త్వరలోనే నా నెక్స్ట్ సినిమా గురించి చెప్తాను. హీరో రామ్ గారికి కథ చెప్పాలి. అలాగే హిందీలో కూడా ఒక సినిమా చేయాలని ఉంది, షారుఖ్ ఖాన్ గారితో సినిమా తీయాలని ఉంది” అని తెలిపాడు అనుదీప్.
