Rrr
RRR: యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను ఎప్పుడు వెండితెర మీదకి తెస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. అయితే.. గత ఏడాది నుండి ఈ ఏడాది వరకు దాదాపుగా ఏడాది కాలం కరోనా ఉపద్రవంలో కొట్టుకుపోవడంతో అన్ని సినిమాలతో పాటే ఈ సినిమా కూడా విడుదలలో క్లారిటీ లేకుండాపోయింది.
అయితే, దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ సినిమాను ఏదిఏమైనా అక్టోబర్ 13న విడుదల చేయాలని ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్టోబర్ 13న సినిమా విడుదల చేయనున్నట్లు కరోనా సెకండ్ వేవ్ కు ముందే ప్రకటించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తో ఆ తేదీపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. కానీ.. ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఏది ఏమైనా ఆ తేదీకి సినిమాను తీసుకొచ్చేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తుంది.
రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు, సోదరుడైన ఎంఎం కీరవాణి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ కీరవాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అక్టోబర్ 13న సినిమా విడుదల కానుందని మరోసారి చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైనట్లుగా ప్రకటించిన యూనిట్ ఇప్పుడు విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి ఎదురుచూపులు అక్టోబర్ 13 కోసమే.
Wishing our Musical genius @MMKeeravaani garu, a very Happy Birthday. Can't wait for the world to groove to the music of #RRRMovie very soon!!! ?
DHARA DHAM DHARA
DHAM DHARA DHAM DHAM.. ?? pic.twitter.com/V7ZI6k6yBf— RRR Movie (@RRRMovie) July 4, 2021