Delhi High Court on coronil: ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు: కోరోనిల్‭పై రాందేవ్‭కు హైకోర్టు వార్నింగ్

పతంజలి రూపొందించిన కోరోనిల్, కొవిడ్-19ని తగ్గిస్తుందని, కొవిడ్‭కి ఇదే మందని కొంత కాలం క్రితం బహిరంగ సభలో రాందేవ్ బాబా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ఆరోగ్య శాఖ కోరోనిల్‭కు గుర్తింపునిచ్చాయని సైతం ప్రచారం చేశారు. అయితే ఇదంతా అవాస్తవమని తర్వాత తెలిసింది

Delhi High Court on coronil: కొవిడ్-19కి మందంటూ ప్రచారం చేసిన కోరోనిల్ సహా ఇతర అలోపతి మందుల విషయమై యోగా గురువు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించోద్దని బుధవారం కోర్టు పేర్కొంది. కోరోనిల్, అలోపతి విషయమై రాందేవ్‭కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‭పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ భంబాని నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ ‘‘మీకు అనుచరులు, శిష్యులు, మిమ్మల్ని విశ్వసించే వ్యక్తులు ఉండడంలో తప్పులేదు. కానీ, వారిని ఏర్పరుచుకోవడానికి అతిగా చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’’ అని వ్యాఖ్యానించింది.

వాస్తవానికి ఆయుర్వేదానికి ఉన్న మంచి పేరు, గుర్తింపు పట్ల తమకు పట్టింపు ఉందని, అలా అని అలోపతిని తప్పు పట్టే ప్రచారం ఎవరూ చేయకూడదని కోర్టు పేర్కొంది. గతంలో కొవిడ్ వ్యాక్సీన్‭పై రాందేవ్ చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ప్రస్తావిస్తూ ‘‘నేను వ్యాక్సీన్ తీసుకోనని చెప్పడానికి స్వాతంత్ర్యం ఉంది. కానీ వ్యాక్సీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది పనికిరానిదని ప్రచారం చేయడం సరికాదు’’ అని కోర్టు పేర్కొంది.

పతంజలి రూపొందించిన కోరోనిల్, కొవిడ్-19ని తగ్గిస్తుందని, కొవిడ్‭కి ఇదే మందని కొంత కాలం క్రితం బహిరంగ సభలో రాందేవ్ బాబా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ఆరోగ్య శాఖ కోరోనిల్‭కు గుర్తింపునిచ్చాయని సైతం ప్రచారం చేశారు. అయితే ఇదంతా అవాస్తవమని తర్వాత తెలిసింది. దీనితో పాటు అలోపతిని రాందేవ్ బాబా అవమానించారంటూ దేశంలోని డాక్టర్లు ఆ మధ్య పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం కోరోనిల్ అమ్మకాల్ని పతంజలి నిలిపివేసింది.

BJP parliamentary board: బీజేపీ కీలక విభాగం నుంచి గడ్కరీ, శివరాజ్ ఔట్

ట్రెండింగ్ వార్తలు