BJP parliamentary board: బీజేపీ కీలక విభాగం నుంచి గడ్కరీ, శివరాజ్ ఔట్

ఈ బాడీలో పార్టీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన నితిన్ గడ్కరీని తప్పించారు. తాజాగా 15 మందితో వేసిన కమిటీలో గడ్కరీ పేరు లేదు. ఇక బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన శివరాజ్ సింగ్ చౌహార్ సైతం ఈ కమిటీలో చోటు దక్కించుకోలేకపోయారు. 15 ఏళ్లకు పైగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన పార్టీలో కీలక నేత. అలాంటిది ఈయనను కూడా తాజా కమిటీలోకి తీసుకోలేదు. అయితే కేంద్ర రక్షణ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజ్‭నాథ్ సింగ్‭కు మళ్లీ అవకాశం కల్పించారు.

BJP parliamentary board: బీజేపీ కీలక విభాగం నుంచి గడ్కరీ, శివరాజ్ ఔట్

Gadkari and Chouhan dropped from BJP top board

BJP parliamentary board: కీలక నిర్ణయాలు తీసుకునే భారతీయ జనతా పార్టీ టాప్ బాడీలోకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‭లకు చోటు దక్కలేదు. చాలా కాలంగా ఈ కమిటీలో కీలకంగా ఉన్న వీరిని పక్కన పెట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా, ఈ విభాగంలో అనూహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు చోటు దక్కడం విశేషం.

బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ అంటే పార్టీకి అత్యంత కీలకమైన విభాగం. ఇందులో ఉన్న సభ్యులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీ అధ్యక్షులు సహా పార్టీలోని కీలక నేతల్ని పిలిపించి మాట్లాడేంత పవర్ ఉంటుంది. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేది ఈ బాడీనే. పార్టీ సీనియర్ నేతలు సహా కీలక నేతలు ఈ బాడీలో ఉంటారు. అలాగే పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పని చేసిన వారిని తప్పనిసరిగా తీసుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

అలాంటిది ఈ బాడీలో పార్టీకి గతంలో జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన నితిన్ గడ్కరీని తప్పించారు. తాజాగా 15 మందితో వేసిన కమిటీలో గడ్కరీ పేరు లేదు. ఇక బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన శివరాజ్ సింగ్ చౌహార్ సైతం ఈ కమిటీలో చోటు దక్కించుకోలేకపోయారు. 15 ఏళ్లకు పైగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన పార్టీలో కీలక నేత. అలాంటిది ఈయనను కూడా తాజా కమిటీలోకి తీసుకోలేదు. అయితే కేంద్ర రక్షణ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజ్‭నాథ్ సింగ్‭కు మళ్లీ అవకాశం కల్పించారు.

అధిష్టానం బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన యడియూరప్పకు పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కింది. అయితే కర్ణాటక బీజేపీలో అత్యంత ప్రభావం ఉన్న యడియూరప్ప, పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని, ఆయనను శాంతింప జేసేందుకే పార్లమెంటరీ విభాగంలో చోటు కల్పించినట్లు సమాచారం. ఈయనతో పాటు అధిష్టానం నిర్ణయం మేరకు హిమంత బిశ్వా శర్మను ముఖ్యమంత్రి చేయడం కోసం తాను పదవీ త్యాగం చేసిన అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‭కి చోటు దక్కింది. ఇక మహారాష్ట్రలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించడమే కాకుండా.. ముఖ్యమంత్రి పదవిని వదులుకుని ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్‭కు సైతం ఈ బోర్డులో చోటు కల్పించారు.

Supreme Court On Freebies: ఆ విషయంలో రాజకీయ పార్టీలను అడ్డుకోలేం.. పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..