Freedom Fighter Azad: చంద్రశేఖర్ తివారీకి ‘ఆజాద్’ అని పేరెందుకొచ్చిందో తెలుసా ..

భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన.. చదువుకోవడం ఇష్టం లేక పదమూడవ యేట ఇంటినుంచి పారిపోయాడు. ముంబయి పారిపోయి అక్కడే మురికి వాడలో నివసించాడు.

Freedom Fighters Azad: భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన.. చదువుకోవడం ఇష్టం లేక పదమూడవ యేట ఇంటినుంచి పారిపోయాడు. ముంబయి పారిపోయి అక్కడే మురికి వాడలో నివసించాడు. అనేక కష్టాలు ఎదురైన ఇంటికి వెళ్లేందుకు ధైర్యం సరిపోక మురికి వాడల్లోనే జీవనం సాగించాడు. ఈ కష్టాలకన్నా సంస్కృతమే మేలనిపించింది. దీంతో 1921లో వారణాసికి వెళ్లిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరాడు. అదే సమయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడుకుతుంది. తాను కూడా అందులో భాగస్వాముడిని కావాలని చంద్రశేఖర్ నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుల మాటలతో ఆజాద్‌లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి.

Independence India Diamond Festival

ఈ క్రమంలో ఓ కేసు విషయంలో 15ఏళ్ల వయస్సులో చంద్రశేఖర్ తివారీ బ్రిటీష్ ఇండియా కోర్టు హాలుకు హాజరయ్యారు. అతనిని విచారిస్తున్నన్యాయధికారి ‘నీ పేరేమిటి’ అని ప్రశ్నించాడు. వెంటనే చంద్రశేఖర్ తివారీ అని చెప్పకుండా ఆజాద్ అని బదులివ్వడంతో.. ‘తండ్రి పేరేంటి’ అని న్యాయవాధి ప్రశ్నిస్తాడు… స్వతంత్రం అని జవాబు వచ్చింది. ‘నీ ఇల్లు ఎక్కడ’ అని అడిగితే… కారాగారం అని చంద్రశేఖర్ తివారి సమాధానం చెప్పడంతో న్యాయమూర్తికి ఆగ్రహంతో పాటు ఆశ్చర్యం కలిగాయి. మొదట15 రోజుల కారాగార శిక్ష విధించిన దాన్ని 15 కొరడా దెబ్బలుగా మార్చాడు. దీంతో ఆజాద్​ ఆ క్షణమే మళ్లీ జీవితంలో ఆంగ్లేయులకు దొరకబోనని ప్రతినబూనాడు. ఆ సంఘటన తర్వాత చంద్రశేఖర్ తివారీ కాస్త.. చంద్రశేఖర్ ఆజాద్ గా పేరొందాడు.

Chandra Shekhar Azad

చంద్రశేఖర్ ఆజాద్ చిన్న వయస్సులోనే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బలంగా పోరాడాడు. 1928లో చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్, సుఖ్ దేవ్ తదితరులతో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. వీరందరూ కలిసి లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన స్కాట్ అనే బ్రిటీష్ పోలీసు అధికారిని చంపాలని భావించారు. అయితే స్కాట్ ను బదులు వేరే పోలీసులను కాల్చారు. బ్రిటీస్ పోలీసులు వెతకడం మొదలు పెట్టడంతో కొన్ని రోజులు ఝాన్సీలో రహస్య జీవనం గడిపాడు. కొద్దిరోజులకే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు పార్లమెంట్ పై దాడి చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. వీరిని ఎలాగైనా విడించాలని చంద్రశేఖర్ ఆజాద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు.

అలహాబాద్ లోని చంద్రశేఖర్ ఆజాద్ పార్కు వద్ద ఆజాద్ విగ్రహం

ఓ రోజు అలహాబాద్ వచ్చి ఆల్ఫ్రెడ్ పార్కులో తోటి ఉద్యమ కారులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్న సమయంలో సమాచారం తెలుసుకున్న బ్రిటీష్ పోలీసులు అక్కడకు చేరుకొని ఆజాద్ ను బంధించే ప్రయత్నం చేశారు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో పేల్చడంతో ముగ్గురు పోలీసులు హతమయ్యారు. అక్కడి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేసినా బ్రిటీష్ పోలీసులు ఆజాద్ ను వెంబడించారు. తుపాకీలో ఇంకో తూటానే మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని భావించిన ఆజాద్.. బ్రిటిష్ వారికి పట్టుబడటం ఇష్టంలేక తనను తాను ఆత్మార్పణ చేసుకోవటమే మేలని భావించాడు.. దీంతో 25ఏళ్ల వయస్సులోనే తన వద్ద ఉన్న తుపాకీతో తనను తాను పేల్చుకొని భారత్ మాతాకీ జై అంటూ నేలకూలాడు. ఆజాద్ మరణించిన 25రోజుల తర్వాత భగత్ సింగ్ ను ఉరి తీశారు.

ట్రెండింగ్ వార్తలు