Weight Management: మీ బరువు అదుపులో ఉండాలా?.. అయితే ఈ సూపర్ ఫుడ్ తినాలి!

ఆ బరువు పెరగడం అనేది ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి సమస్యగా మారింది.మ్మో బరువు పెరిగిపోతున్నా కాస్త డైట్ చేయాలి.. ఫుడ్ కంట్రోల్ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి చాలామందిలో ఎక్కువగా వినిపించే మాట ఇదే.

Weight Management: ఆమ్మో బరువు పెరిగిపోతున్నా కాస్త డైట్ చేయాలి.. ఫుడ్ కంట్రోల్ ఉండాలి. ఈ మధ్యకాలంలో మనకి చాలామందిలో ఎక్కువగా వినిపించే మాట ఇదే. బరువు పెరగడం అనేది ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి సమస్యగా మారింది. ఏదో బ్రతుకు పోరులో పడి ఏదేదో తినేయడం.. టైం కాని టైంలో ఎక్కువ తినేయడం.. తినాల్సిన టైంలో తినలేక మానేయడం వంటివి ఎన్నో కలిసి ఈ సమస్యకు దారితీస్తుంది. అందుకే ఏమేం తినాలి.. ఎలాంటి వ్యాయామాలు చేస్తే బరువు తగ్గుతామంటూ పుస్తకాలు తిరగేయడం, ఇంటర్‌నెట్‌లో వెతకడం, ఎవరు ఏ సలహా చెప్పినా పాటించేయడం వంటివి చేస్తుంటారు.

అయితే.. అసలు బరువు నియంత్రణలో ఉండాలంటే ప్రొటీన్లు, ఫైబర్‌తో కూడిన తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. వీటితో పాటు పోషకాలు అధికంగా ఉంటూ అధిక విటమిన్, ఖనిజ పదార్థాలు ఉండే ఆహారాన్ని కూడా తీసుకున్నట్లైతే బరువు నియంత్రణతో పాటు వ్యాధి నిరోధకశక్తి పెరిగి గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇలాంటి ఆహారాలను నిపుణులు సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. వీటిలో కొన్ని తినడానికి మంచి టేస్ట్ కూడా కలిగి ఉండడం మరో అడ్వాంటేజ్ కాగా ఇప్పుడు అలాంటి ఓ ఏడు ఆహార పదార్ధాల గురించి మనం తెలుసుకుందాం.

1. Kale

Weight Management

క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలలో ఒకటైన కాలే శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగి, ప్రపంచంలోని గొప్ప పోషకభరితమైన, ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. ఇది తక్కువ కొవ్వు పదార్ధాలను, తక్కువ కాలరీలను కలిగి పోషకాలలో అధికంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడుకుని పోషకభరితమైన ఆహారంగా ఉంటుంది. కాలేలో పోషక విలువల విషయానికి వస్తే.. 100 గ్రాముల పచ్చి కాలేలో 89.63 గ్రాముల నీరు, 35 కిలో కాలరీల ఎనర్జీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. 2.92g ప్రోటీన్, 4.42 g కార్బోహైడ్రేట్స్, 4.1 g ఫైబర్, 0.99 g చక్కెర, 254 mg కాల్షియం, 1.60 mg ఇనుము, 0.39 mg జింక్, 93.4 mg విటమిన్ C, 4812 ఐయు విటమిన్ ఎ, 0.66 mg విటమిన్ ఇ, 389.6 mg విటమిన్ k ఉంటాయి. అందుకే ఇది తీసుకోవడం వలన గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, అధిక బరువు, రోగనిరోధక శక్తి, కాన్సర్ నివారణ, కంటి సమస్యలకు, ఎముకల పటుత్వానికి, మధుమేహం, చర్మం సంబంధిత సమస్యలు, జుట్టు సమస్యలు వంటి అనేక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

2. Eggs

Weight Management1

కోడి గుడ్డులో బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలిన్ ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. గుడ్డులోని ఐరన్‌ని శరీరం వేగంగా గ్రహిస్తుంది. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి.

3. Broccoli

Weight Management6

బ్రోకలీ కూడా క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒక మొక్క, పూవురూపంలో ఉన్న ఈ కూరగాయ విస్తృత ప్రయోజనాలను కలిగిఉంది. ఇది వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్ల యొక్క గొప్ప మూలం. ఆరోగ్యకరమైన ఆహారం కోసం బ్రోకలీని మనం తీసుకునే ఆహారంలో ఓ భాగంగా చేసుకొమ్మని పౌష్టికాహార నిపుణులు సిఫారసు చేస్తారు. ఈ బ్రోకలీ తక్కువ కేలరీలుగల ఆహార ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. తాజా లేదా ఉడికించిన 100 గ్రా బ్రోకలీలో కేవలం 34 కిలో కేలరీలు మాత్రమే ఉండగా వేయించడానికి నూనె జోడించడం ద్వారా శక్తి విలువ 46 కిలో కేలెంలకు పెంచబడుతుంది. కానీ అదే సమయంలో బ్రోకలీలో విటమిన్లు, ఇతర ఉపయోగకరమైన అంశాలు పెరుగుతాయట.

4. Sweet Potatoes

చిలకడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు అనే చెప్పాలి. శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి. ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది. ఈ దుంప, విటమిన్ డిని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. థైరాయిడ్ గ్రంధి, దంతాలు, ఎముకలు, కండరాలు మరియు చర్మం వంటి భాగాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తూ శరీరాన్ని అధిక బరువు నుండి అదుపులో ఉంచుతుందట.

5. Chickpeas

Weight Management4

శనగల్లో కొవ్వు తక్కువ. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ. ఒక కప్పు కడిగిన చిక్‌పీస్ 10 గ్రాముల ప్రోటీన్‌ను, 34 గ్రాముల కార్బోహైడ్రేట్‌, 10 గ్రాములు డైబర్ ఫైబర్ అందిస్తుందట. చిక్‌పీస్ వలన A, C, K, B6, B12, E విటమిన్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు, ఐరన్, సెలీనియం, రాగి కూడా అందుతాయట. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, గుండె జబ్బులను నివారించడం, రక్తపోటు స్థాయిలను సమతుల్యం చేయడం వంటి లక్షణాలు కలిగిఉందట.

6. Spinach

ఆకుకూరల్లో పాలకూరకి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. దీనిలో ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటూ కొవ్వు తక్కువగా ఉంటుంది. పాలకూర తీసుకోవడంతో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. పాలకూర రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత (నియోనియా) సమస్య తగ్గుతుంది. పాలకూరను ఆహారంలో తీసుకోవడం వలన చర్మానికి కొత్త మెరుపు పొందవచ్చు. ఇక బరువు తగ్గాలనుకునేవారు పాలకూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మూత్రవిసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజూ పాలకూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పాలకూరఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుందట.

7. Quinoa

క్వినోవా అధిక ప్రోటీన్ కలిగి గ్లూటెన్ లేని ఆహారంగా చెప్పుకుంటారు. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, బి విటమిన్లు, ఐరన్, పొటాషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ ఇ మరియు వివిధ ఉపయోగకరమైన యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. 1 కప్పు (185 గ్రాములు) క్వినోవాలో మొత్తం 222 కేలరీలు, 39 గ్రాముల పిండి పదార్థాలు, 4 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ఈ గింజలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతూ బరువు అదుపులోనే ఉంటుందని చెప్తారు. అయితే, ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచికన్నా చెడే ఎక్కువని ఓ హెచ్చరికను గుర్తు పెట్టుకొని ఈ ఆహారాన్ని తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు