మన మెదడు.. విశ్వంలోని పాలపుంతను పోలి ఉందా?

  • Publish Date - November 17, 2020 / 12:58 PM IST

human brain resemble the Universe : మనిషి మెదడును అనంతకోటి విశ్వానికి ప్రతినిధిగా పిలుస్తారు.. ఎందుకంటే శరీర క్రియలను మెదడు నియంత్రిస్తుంది. మెదడు అంటే అతి సూక్ష్మమైన నాడీవ్యవస్థ మాత్రమే కాదు. ఈ విశ్వంలో ఎన్ని నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయో అవన్నీ మన మెదడులోనూ ఉంటాయి.



అన్నింటినీ మింగేయగల బ్లాక్‌హోల్స్‌ విశ్వంలో ఉన్నట్టే.. మెదడులోనూ బ్లాక్ హోల్స్ ఉంటాయి. మనిషి మానసిక ఆందోళనలకు ఈ బ్లాక్ హోల్స్ కారణం.. ఇంతకీ మనిషి మెదడుకు, విశ్వానికి పోలికేంటి? విశ్వంలోని పాలపుంత (నక్షత్రాల గుంపు) మాదిరిగా మన మెదుడులో కూడా అలాంటి నాడికణాల గుంపు ఉందా? అంటే అవుననే అంటున్నారు ఖగోళ-భౌతిక శాస్త్రజ్ఞులు.
University of Veronaలోని న్యూరో సర్జన్, University of Bolognaలోని ఖగోళ-భౌతిక శాస్త్రజ్ఞుడు మనిషి మెదడుకు మధ్య పోలికలపై అధ్యయనం చేశారు. మనిషి మెదడులోని నాడీ కణాల వ్యవస్థకు పాలపుంతలోని విశ్వసంబంధిత వ్యవస్థకు మధ్య ఒకేరకమైన పోలికలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

దీనికి సంబంధించి అధ్యయనాన్ని ఫిజిక్స్‌లోని Frontiersలో ప్రచురించారు. Bologna, Verona యూనివర్శిటీలకు చెందిన ఫ్రాంకా వజ్జా (ఖగోళ-భౌతిక శాస్త్రజ్ఞులు), అల్బర్టో ఫెలెట్టి (న్యూరోసర్జన్) లోతుగా విశ్లేషించారు.



ఈ రెండింటిలో ఒకే రకమైన పోలికలు ఉన్నాయని గుర్తించారు. ప్రకృతిలో ఈ రెండింటి మధ్య అనేక సవాళ్లు, క్లిష్టమైన వ్యవస్థలతో కూడిన సమూహమని చెబుతున్నారు. రెండు వ్యవస్థల మధ్య గణనీయమైన తేడాలు కూడా ఉన్నాయంటున్నారు.
విశాలమైన నాడి వ్యవస్థ కలిగిన మెదడులో పనితీరు ఎంతో అద్భుతమైనది.. మెదడులో దాదాపు 69 బిలియన్ల నాడీకణాలు ఉంటాయి. అలాగే విశ్వాన్ని పరిశీలిస్తే.. విశ్వసృష్టిలో కూడా 100 బిలియన్ల గెలాక్సీ (పాలపుంత)లు ఉన్నాయి.



ఈ రెండింటి వ్యవస్థల్లో 30 శాతం మాత్రమే గుంపులతో కూడిన పాలపుంతలు, నాడీకణాలు మిళితమై ఉంటాయి. ఈ వ్యవస్థల్లో పాలపుంతలు, నాడీకణాలతో కలిపి దీర్ఘ తంతువులు ఉంటాయి. రెండు కలిపి 70శాతం ద్రవ్యరాశి లేదా శక్తి సమ్మేళనాలతో క్రియాశీల పాత్రను పోషిస్తాయి.

మెదడులో ఉండే నీరు, విశ్వంలో ఉండే చీకటి శక్తి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. మెదడు, సృష్టికి మధ్య చిన్నమెదడు, మస్తిష్క వల్కలం కూడా పాలపుంత (నక్షత్ర మండలం)తో రీసెర్చర్లు పోల్చి చూశారు.



మెదడులోని నాడీ కణాల వ్యవస్థలో కలిగే క్రియల హెచ్చుతగ్గులు విశ్వంలో మాదిరిగా ఒక మైక్రోమీటర్ నుంచి 0.1 మిల్లీ మీటర్లవరకు ఉన్నాయని గుర్తించారు.



అతిపెద్ద క్రమంలో 5 మిలియన్ల నుంచి 500 మిలియన్ల కాంతి సంవత్సరాల వరకు వ్యాపించి ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థలోని కొన్ని కణాల సమూహాంతో వీటికి దగ్గరి పోలికలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.