Viral Video: టీవీ లైవ్‌లో మైక్ లాక్కెళ్లిన కుక్క.. వెంటపడిన రిపోర్టర్!

రష్యాకు చెందిన ఒక మీడియా ఛానెల్ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. సడన్ గా వచ్చిన ఒక కుక్క రిపోర్టర్ చేతిలో మైకును లాక్కెళ్ళింది. దీంతో ఆ రిపోర్టర్ నా మైకు.. నా మైక్ అంటూ కుక్క వెంటపడడం మొత్తం కెమెరాలో రికార్డయింది.

dog that Mike picked up on TV Live.: పపంచమంటేనే వింతలు, విన్యాసాల మాయం. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎలా మలుపు తిరుగుతుందో ఒక్కోసారి ఎవరం ఊహించలేం. అలా అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు అనుభవించేవారికి సంకటమైతే.. చూసే వారికి నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ నెటిజన్లలో నవ్వులు పూయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా న్యూస్ మీడియా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ప్రజలకు అర్ధమయ్యేలా కాస్త క్రియేటివిటీని కూడా జోడించి లైవ్ లో ప్రజెంట్ చేయడమే ఇప్పుడు నడిచే జమానా. అయితే.. ఒక్కోసారి ఈ లైవ్ ప్రజెంటేషన్ లో తలెత్తే అనుకోని ఘటనలు కూడా ప్రేక్షకులకు చేరిపోతుంటాయి.

అలా న్యూస్ రిపోర్టర్ లు.. న్యూస్ యాంకర్స్ తడబడడం.. ఘటనా స్థలంలో అనుకోని ఘటనలను ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలే స్వయంగా బ్లూపర్స్ పేరిట విడుదల చేస్తున్నాయి. అలా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. రష్యాకు చెందిన ఒక మీడియా ఛానెల్ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా.. సడన్ గా వచ్చిన ఒక కుక్క రిపోర్టర్ చేతిలో మైకును లాక్కెళ్ళింది. దీంతో ఆ రిపోర్టర్ నా మైకు.. నా మైక్ అంటూ కుక్క వెంటపడడం మొత్తం కెమెరాలో రికార్డయింది.

రష్యా రాజధాని మాస్కోలో వాతావరణం చల్లగా మారిపోయింది. ఒక ఛానెల్ కి చెందిన నాదెజ్దా సెరెజ్కినా అనే మహిళా రిపోర్టర్ … దేశంలోని వాతావరణ మార్పులపై లైవ్ ఇస్తుంది. ఛానెల్ న్యూస్ రూమ్ నుంచి యాంకర్ ఓ ప్రశ్న అడగ్గా… రిపోర్టర్ వాతావరణంపై వివరణ ఇస్తుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందోగానీ ఓ కుక్క… ఒక్కసారిగా ఆమెపైకి ఉరికి ఆమె చేతిలోని మైక్‌ని నోటితో కరచుకుని తుర్రుమంది. కుక్క మీదకు రావడంతో ఏ చేయాలో తెలియక కంగారు పడిన ఆమె వెంటనే తేరుకొని నా మైకు.. నా మైకు… అంటూ కుక్క వెంట పరుగులు పెట్టింది.

రిపోర్టర్.. కెమెరామెన్ మధ్యలో ఓ కుక్క.. ఈ సీన్ అంతా కెమెరాలో రికార్డవుతుండగా ఛానెల్ లో లైవ్ లో వచ్చేసింది. ఈ ఊహించని ఘటనతో షాకైన యాంకర్‌ ముఖంలో రంగులు మారిపోయాయి. ఎలాగోలా ఏదోకటి చెప్పేసి లైవ్ ముగించేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఊహించని విధంగా ఆ ఛానెల్ ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే కోటిమందికి పైగా చూడగా.. నెటిజన్లు నవ్వుల ఎమోజీలు.. ఫన్నీ కామెంట్స్ పెడుతూ సంబరపడిపోతున్నారు.