Panipuri: వానాకాలంలో పానీపూరీ తినకండి: తెలంగాణ డీహెచ్

పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.

Panipuri

Panipuri: పానీపూరీ తినడం వల్లే తెలంగాణలో టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు తెలంగాణ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) శ్రీనివాస రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవలి కాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగిపోతుండటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.

Nadendla Manohar: సీఎంను నిద్రలేపేందుకే ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమం: నాదెండ్ల

వానాకాలంలో పానీపూరీ తినకండి. తోపుడు బండ్లపై అమ్మే ఆహార పదార్థాలు కూడా తినకండి. పానీపూరీ అమ్మేవాళ్లూ జాగ్రత్తలు తీసుకోవాలి. కాచి వడపోసిన నీటితోనే పానీపూరీని తయారు చేయాలి. బండి చుట్టూ దోమలు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పది రూపాయల పానీపూరీకి ఆశపడితే పది వేల రూపాయలు వదిలించుకోవాల్సి వస్తుంది. మరోవైపు తెలంగాణలో గత జనవరి నుంచి డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 516 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి’’ అని శ్రీనివాస రావు తెలిపారు.