Dried Lemon benefits : ఎండిపోయిన నిమ్మకాయలు పారేయకండి.. ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

ఎండిన నిమ్మకాయలు బయట పారేస్తున్నారా? ఎండిన నిమ్మకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఇంకా ఎన్నో ఇతర ఉపయోగాలున్నాయి.

Dried Lemon benefits

Dried Lemon benefits : నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చాలామంది శరీరంలో నీటి శాతం పడిపోకుండా ఉండేందుకు ఉదయాన్నే నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగుతారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా నిమ్మరసం సహాయపడుతుంది. ఇంకా అనేక రకాలుగా నిమ్మకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. వేసవిలో వీటికి డిమాండ్ ఎక్కువ. అయితే ఒక్కోసారి వీటిని వాడకపోవడం వల్ల ఎండిపోతుంటాయి. అలాంటి వాటిని బయట పారేస్తున్నారా? వాటివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆ పని చేయరు.

Lemon And Fenugreek Water : ఉదయం నిద్రలేవగానే మెంతులు, నిమ్మకాయ నీరు త్రాగటం వల్ల బరువు తగ్గుతారా ? దీన్ని ఎలా సిద్ధం చేయాలంటే ?

సమ్మర్‌లో నిమ్మకాయలు విరివిగా దొరుకుతాయి. డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారగానే వాటి వాడకం కాస్త తగ్గిస్తుంటాం. ఇంట్లో ఒక్కోసారి వాడకపోవడం వల్ల ఎండిపోతుంటాయి. అలాంటి వాటిని బయట పారేస్తుంటాం. ఎండిన నిమ్మకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, చక్కెర, పిండి పదార్థాలు, డైటరీ ఫైబర్, కొవ్వు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

 

ఎండిన నిమ్మకాయల్లో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆంక్సిడెంట్ ఆర్గానిక్ సమ్మేళనం ఉంటుంది. ఇవి బరువు పెరగకుండా మరియు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. ఎండిన నిమ్మకాయను రోజు తీసుకోవడం వల్ల రక్తపోటు మెరుగుపడే అవకాశాలు ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఎండిన నిమ్మకాయల్ని వంటల్లో వాడతారు. చేపలు, సూప్‌లు మరియు కూరగాయల్లో దీనిని వాడతారు. అలాగే కాల్చిన మాంసం, కాల్చిన వస్తువులు, కేక్‌లు, సాస్‌లకు కూడా వీటిని యాడ్ చేస్తారు. ఎండిన నిమ్మకాయ ముక్కల్ని నీరు, ఐస్ లేదా వేడి టీలో కూడా వాడతారు. ఇక వీటి కోసం ప్రత్యేకంగా ఎండిన నిమ్మకాయ ముక్కలను కొనుగోలు చేస్తుంటారు కూడా.

Lemon Peels : నిమ్మకాయ తొక్కలతో చర్మ సమస్యలు, నల్ల మచ్చలు, ముడతలు తొలగించుకోవటంతోపాటు అనేక ప్రయోజనాలు!

ఎండిన నిమ్మకాయల్ని పొడిగా చేసుకుని కూరల్లో వాడటమే కాదు.. నీటిలో ఆ పొడి వేసుకుని హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. ఒక్కోసారి చాపింగ్ బోర్డు జిడ్డుగా తయారవుతుంది. చాపింగ్ బోర్డుపై కాస్త ఉప్పు వేసి ఎండిన నిమ్మకాయ వేసి రుద్దితే చాపింగ్ బోర్డు క్లీన్‌గా అవుతుంది. అలాగే జిడ్డు పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఎండిన నిమ్మ కాయల్ని వాడతారు. అలా చేయడం వల్ల జిడ్డు పోతుంది.