Dog thiefing lipstick : చోరీలు మనుషులు చేస్తారు. కానీ ఓ కుక్క మాత్రం దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి పోయింది. ఇంతకీ ఆ కుక్క దొంగతనం చేసిందేంటో తెలుసా? ‘లిప్ స్టిక్’ దొంగతనం చేసింది. కుక్క దొంగతనం చేసిందంటేనే వింత..పైగా ఆ కుక్క లిప్ స్టిక్ ను కాజేయటం ఏంటి? అదే మరి విశేషం. ఇంతకీ ఆ కుక్క లిప్ స్టిక్ ను పెదాలకు వేసుకోలేదు…అదేనండీ మూతికి వేసుకోలేదు. కాళ్లకు వేసుకుంది? అలా వింత వింత చేష్టలు చేసిన ఆ కుక్క సోషల్ మీడియాల సెలబ్రిటీ అయిపోయింది..మరి కాళ్లకు లిప్ స్టిక్ వేసుకున్న ఆ దొంగతనం చేసిన ఆ కుక్క నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
డాక్టర్ సుల్భా కేజీ అరోరా అనే యవతి తన ట్విటర్ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. సుల్భా.. ‘‘ నిన్న రాత్రి ఓ దొంగ డ్రెసర్లోంచి మా అమ్మ లిప్‌స్టిక్‌ను దొంగిలించుకుపోయాడు. లక్కీగా ఆ దొంగ దొరికేశాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నాం’’ అని చెప్పుకొచ్చింది. ఇదే మా అమ్మ లిప్ స్టిక్ ను దొంగతనం చేసిన ఆ దొంగ అంటూ కాళ్లకు లిప్‌స్టిక్ రంగుతో ఉన్న పెంపుడు కుక్క ఫొటోను కూడా షేర్ చేసింది. కాళ్లకు ఎర్రరంగు లిప్ స్టిక్ అంటుకున్న ఈ కుక్క సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘‘ తిన్నింటి వాసాలు లెక్కపెట్టడానికి సిగ్గులేదు’’ అని కొందరంటే..‘ దొంగతనం చేసి..ఏమీ తెలియని అమాయకంగా ఫేస్ ఎలా పెట్టాడో చూడండి!’’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొదరైతే మళ్లీ ఇలాంటి పనులు చేయకుండా ఆ దొంగకు గోడకుర్చీ వేయించాలి’’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ కామెంట్స్ చూసిన డాక్టర్ సుల్భా కేజీ అరోరా స్పందిస్తూ.. ‘‘ నేను దొంగను పట్టుకుని లిప్‌స్టిక్‌ను స్వాధీనం చేసుకున్నా.. అందుకే నా పాదాలు ఎర్రగా అయ్యాయమ్మా..’’ అని కామెంట్ చేశారు. భలే ఉంది కదూ కాళ్లకు లిప్ స్టిక్ వేసుకున్న కుక్కగారీ చోరీ స్టోరీ..
Last night a thief stole one of mom's lipsticks from her dresser and ran away with it but luckily we caught him 'red-handed'. pic.twitter.com/1LwwDDm1Qh
— Dr Sulbha KG Arora (@SulbhaArora) February 9, 2021