Dragon Fruit : రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించే డ్రాగన్ ఫ్రూట్!
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.
- Guntupalli Ramakrishna
- Published On : August 16, 2022 / 04:47 PM IST
Dragon fruit (1)
Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయి. రోజుకు ఒక పండు తినటం వల్ల శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు నుంచి సుమారు 136 కేలరీలు అందుతాయి. దీనిలో 29 శాతం పిండిపదార్థం, 3 గ్రా మాంసకృత్తులు, 7 గ్రా పీచు, 8 శాతం ఇనుము ఉంటాయి. జీరో ఫ్యాట్ ను కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్లు, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున హార్ట్ సమస్యలు రావు. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.
